HomeEntertainmentచంద్రమోహన్ గారికి జన్మదిన నివాళి🙏🏻

చంద్రమోహన్ గారికి జన్మదిన నివాళి🙏🏻

- Advertisment -

చంద్రమోహన్ “16 ఏళ్ల వయసు చిత్రంలో”కుంటి వాడి పాత్రలో “కట్టుకథలు చెప్పి”అని పాడుతుంటే,ఆ నటనకు హాల్లో నవ్వులు కట్టలు తెంచుకున్నాయి.”కుంటివాడికి ఈ పాట ఏంటి” అన్న లాజిక్ ని మరిచిపోయేలా చేసాడు చంద్రమోహన్. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి సన్నివేశానికి సొబగులు అద్దిన సహజ నటుడు చంద్రమోహన్


స్వాతిముత్యం సినిమాలో,”కమల్ హాసన్ పాత్ర,చంద్రమోహన్ వేస్తే ఎలా ఉంటుంది” అన్న ఆలోచన వస్తే, “చంద్రమోహన్ కే అతని స్టైల్ లో అతను అద్భుతంగా చేస్తాడు,అంతేగాని చెడగొట్టడు”అని వస్తుంది సమాధానం.దానికి గీటు రాళ్లు సిరిసిరిమువ్వ సీతామాలక్ష్మి అల్లుడుగారులో ప్లీడర్, “ఆమె” సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలు.


చంద్రమోహన్ దగ్గర నేర్చుకోవలసినది నిబద్దత. ప్రొద్దుటే సెట్టుకు రాగానే మొదట అడిగేది సీన్ పేపర్ ఆ తరువాతే అన్ని. సీన్ పేపర్ చదువుతాడు డైలాగ్ డిక్షన్ ఇలా ఉండాలి ఎదుటి నటుడు చెప్పే డైలాగ్ కి ఎక్స్ప్రెషన్ ఇలా కంటిన్యూ చేయాలి అని ప్రిపేర్ అవుతాడు.ఆ షూటింగ్ 6 నెలల తర్వాత చేసిన ఆ మెజర్మెంట్స్ లోనే ఉంటుంది ఆయన నటన.పాత్ర మీద అంత పట్టు ఆయనకు. ఒకవేళ దర్శకుడు అలా కాదు అంటే ఆయన అడిగే హావభావాల్ని అర్థం చేసుకొని సెకండ్ లో దర్శకుడికి కావాల్సింది అందించే క్యాచింగ్ పవర్ చంద్రమోహన్ గారిది. అందుకే ఆయనకి ఏ పాత్ర అయినా నల్లేరు మీద నడక.దర్శకుడు రేలంగి నరసింహారావు గారు చంద్రమోహన్ గారు హీరోగా కొంటె కాపురం అనే సినిమా తీశారు అది 100 డేస్ ఆడింది.అలాగే చంద్రమోహన్ హీరోగా రేలంగి గారి మొదటి సినిమా నేను మా ఆవిడ.ఆ సినిమా కూడా వందరోజులు ఆడింది. ఇందులో చంద్రమోహన్ హీరోయిన్ ప్రభ ల మధ్య వచ్చే కామెడీకి జనం విరగబడి నవ్వారు.

బ్యాచిలర్స్ కి,ఇల్లు దొరకని ఆ రోజుల్లో, హీరో చంద్రమోహన్ ఆ ఇంటి ఓనర్ నిర్మలమ్మతో, పెళ్లయింది అని అబద్ధం చెబుతాడు. తన భార్య అని ఓ పిచ్చి ఫోటోచూపిస్తాడు తెల్లారుతుంది చంద్రమోహన్ ఎదురుగా పెట్టె పట్టుకుని, ఫోటోలో చూపించిన అమ్మాయి వయ్యారాలు వలకపోస్తూ నిలబడి ఉంటుంది.అంతే చంద్రమోహన్ కొంప కొల్లేరు అయిపోయినట్టు ఎక్స్ప్రెషన్ ఆ కొల్లేటి కాపురం కోటి నవ్వుల పడవ మీద క్లైమాక్స్ వరకు పరిగెడుతూనే ఉంటుంది.అదే పాలుమీగడ,పెరుగు ఆవడ ఒకరికి ఒకరై ,రెండు తోడై కలిసిన జోడ నేను మా ఆవిడ.ఈసినిమాలో చంద్రమోహన్ ఎక్కడ గ్యాప్ లేకుండా తన నటనతో నవ్విస్తూనే ఉంటాడు.నవరసాల మీద అతనికి పట్టుంది, తెచ్చిపెట్టుకున్న నటనలా కాకుండా టచ్ చేసేలా నటిస్తాడు చంద్రమోహన్.
చంద్రమోహన్ గారికి జన్మదిన నివాళి🙏🏻

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments