HomeEntertainmentఓ బడాబాగ్ని ఆరిపోయింది

ఓ బడాబాగ్ని ఆరిపోయింది

- Advertisment -

భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్న విలక్షణ నటుడు నానా పటేకర్ 75 ఏళ్ల వయసులో గురువారం ఉదయం గోవాలో గుండెపోటుతో కన్నుమూశారు.
తెల్లవారుజామున అస్వస్థతకు గురైన నానా పటేకర్‌ను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. ఉదయం సుమారు 5.20 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
మరాఠీ రంగస్థలం నుంచి తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించిన నానా పటేకర్.. ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘అగ్నిసాక్షి’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘వెల్‌కమ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా… ఏ పాత్రలో కనిపించినా తనదైన శైలితో ఆ పాత్రకు ప్రాణం పోశారు.
మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న నానా పటేకర్‌కు 2013లో పద్మశ్రీ పురస్కారం లభించింది.
తెరపై ఆయన పలికించిన ప్రతి మాటకు ఒక ప్రత్యేకమైన శక్తి…
ఆయన పోషించిన ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన జీవం…
ఆ గొంతు ఇక వినిపించకపోయినా…
భారతీయ సినిమా ఉన్నంతకాలం నానా పటేకర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది.
ఓ విలక్షణ నటుడికి కన్నీటి నివాళి!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments