ఔట్ ఫుట్ అద్భుతః అంటూ
హామీ ఇచ్చిన కింగ్ నాగార్జున
అఖిల్ అక్కినేని టైటిల్ పాత్రలో నటిస్తోన్న మూవీ ‘లెనిన్’. భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడు. ఈ సినిమాను జూన్ 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఆ తేది మారింది. ఇప్పుడు సినిమా జూలై 10న రిలీజ్ కానుంది.
తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని నిర్మాత కింగ్ నాగార్జున తెలియజేశారు. లెనిన్ సినిమాను థియేటర్స్‌లో చూసే ఆడియెన్స్‌కు స్పెషల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం బెటర్ ఔట్ పుట్ అవసరం. దాని కోసం మరింత సమయం కావాలని, ఎంటైర్ టీమ్ అందుకు కష్టపడుతోందని ఆయన తెలియజేశారు. లెనిన్ మూవీలో ప్రేక్షకులు సరికొత్త అఖిల్ అక్కినేనిని చూడబోతున్నారంటూ అక్కినేని నాగార్జున హామీ ఇచ్చారు!!

