విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జనవరి 12 విడుదల’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి ఆర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ ఇటీవల హిలేరియస్, ఎంటర్‌టైనింగ్ వీడియో ద్వారా ప్రకటించారు. దీంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది. ఇప్పటికే వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్‌ను పరిచయం చేసిన మేకర్స్.. తాజాగా హీరోయిన్ కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెను ‘దీపు’ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు

