మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. టైటిల్ గ్లింప్స్ , ఫస్ట్ సింగిల్ ‘కంసంనిద’, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ‘రాసగుమ్మడి’ ఫుల్ లిరికల్ సాంగ్‌ను జూలై 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొరియన్ కనకరాజు లో దక్షా నాగర్కర్ స్పెషల్ సాంగ్ చేస్తోంది. వరుణ్ తేజ్, దక్షా నాగర్కర్‌పై చిత్రీకరించిన రాసగుమ్మడి సాంగ్ కలర్‌ఫుల్ రాయలసీమ జాతర నేపథ్యంలో తెరకెక్కిన మాస్ డ్యాన్స్ నంబర్‌గా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది!!

