అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న సినిమా “హైవాన్”. సరికొత్త థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీతో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. “హైవాన్” సినిమా సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ క్యారెక్టర్స్ ఇంటెన్స్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాయి.
ప్రియదర్శన్ శైలిలో సాగే ఒక యూనిక్ థ్రిల్లర్ గా “హైవాన్” సినిమా ఉండబోతున్నట్లు ఈ ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తోంది

