HomeEventsకార్తికేయ కమ్ బ్యాక్ చిత్రం

కార్తికేయ కమ్ బ్యాక్ చిత్రం

- Advertisment -

ట్యాలెంటెడ్ టాలీవుడ్ యంగ్ హీరోల్లో కార్తికేయ గుమ్మకొండ ఒకరు. ‘ఆర్ఎక్స్ 100’లో ఆయన నటనకు ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. హీరోగా మాత్రమే కాదు… నటుడిగానూ ప్రేక్షకుల మదిలో ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. తనలో స్టైలిష్ విలన్ ఉన్నాడని ‘నానీస్ గ్యాంగ్ లీడర్‌’తో చూపించారు. కోలీవుడ్ స్టార్ అజిత్ ‘వలిమై’లో తనదైన విలనిజంతో తమిళ ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. అయితే ఆయన నుంచి సినిమా వచ్చి రెండేళ్ళు దాటుతోంది. ఇప్పుడు కార్తికేయ గుమ్మకొండ మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తున్నారు.

కథానాయకుడిగా రెండేళ్ళ విరామం తర్వాత కార్తికేయ గుమ్మకొండ చేస్తున్న సినిమా ‘కమ్‌బ్యాక్’. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే… ‘కమ్‌బ్యాక్‌’తో కార్తికేయ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమాను ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 21న అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు ఆయన సతీమణి లోహితా రెడ్డి నిర్మాత!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments