రెబల్ స్టార్ ప్రభాస్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఎక్స్‌ట్రావెగాంజా ‘కల్కి 2898 ఏడీ’ కోసం క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన ప్రపంచం ఇప్పుడు మరింత భారీ స్థాయిలో విస్తరించబోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌లో ప్రభాస్ మరోసారి అలరించబోతున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రల్లో కొనసాగనున్నారు. మరింత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చాప్టర్ కోసం నాగ్ అశ్విన్ తెరవెనుక ఇంటెన్స్ వర్క్ చేస్తున్నారు.
ప్రభాస్‌తో పాటు ఇతర కీలక నటీనటులు వచ్చే నెల నుంచి తమ షూట్ లో జాయిన్ కానున్నారు. 2027 మిడ్ కి షూట్ పూర్తి చేయాలని నాగ్ అశ్విన్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది!!

