HomeEntertainmentయాక్షన్, కామెడీ లో జెట్లీ చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్

యాక్షన్, కామెడీ లో జెట్లీ చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్

- Advertisment -

మైత్రి మూవీ మేకర్స్ ప్రజెంట్స్- సత్య, రితేష్ రాణా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘జెట్లీ’ అన్‌లిమిటెడ్ ఫన్, స్టైలిష్ యాక్షన్‌ ట్రైలర్ లాంచ్

కామెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్య, ఇప్పుడు హీరోగా దర్శకుడు రితేష్ రానాతో మళ్లీ జతకట్టి చేస్తున్న చిత్రం ‘జెట్‌లీ’. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మరోసారి క్విర్కీ, డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతుందని ప్రామిస్ చేస్తోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. మే 1న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ఈ కథలో సత్య పోషిస్తున్న పాత్ర ప్రత్యేకంగా నిలుస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయిన ఒక వ్యక్తిగా, తనను తాను వెతుక్కుంటూ వింత పరిస్థితుల్లో ఉంటాడు. కానీ తన ప్రశ్నలకు సమాధానాలు దొరకడం బదులుగా, చుట్టూ ఉన్నవారి నుంచి సెటైర్లు ఎదురవుతాయి. ఈ కాన్సెప్ట్‌ను ఎమోషనల్‌గా కాకుండా పూర్తిగా కామెడీ ట్రాక్‌లో నడిపించడం ఈ సినిమాకి ప్రధాన బలం.

ట్రైలర్‌లో కనిపించే మరో ఆసక్తికర అంశం.. రియాలిటీ, పర్సెప్షన్ మధ్య ఉన్న కాంట్రాస్ట్. అందరికీ సత్య ఒక జోక్‌లా కనిపించినా, తాను మాత్రం పెద్ద యాక్షన్ హీరోలా బిహేవ్ అవుతాడు. ఈ మిస్మ్యాచ్ వల్లే సినిమా మొత్తం నవ్వుల వర్షంగా మారుతోంది. యాక్షన్ సీన్స్ కూడా సీరియస్‌గా కాకుండా, ప్యారడీ టచ్‌తో ఉండటం ప్రత్యేక ఆకర్షణ.

సత్య తన సహజమైన స్టైల్‌లో అండర్‌ప్లే పెర్ఫార్మెన్స్‌తో నవ్వులు పండించారు. ఎక్కువగా ట్రై చేయకుండా కామెడీ క్రియేట్ చేయగలగడం ఆయన ప్రత్యేకతను మరోసారి చూపిస్తుంది.

రియా సింగ్ గ్లామర్‌తో పాటు యాక్షన్‌లో కూడా ఆకట్టుకుంటుండగా, వెన్నెల కిషోర్, వైవా హర్ష తమ ట్రేడ్‌మార్క్ కామెడీతో కథను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చారు.

దర్శకుడు రితేష్ రానా తన ప్రత్యేకమైన స్టైల్‌ను ఈసారి మరింత ఎలివేట్ చేశారు.

టెక్నికల్‌గా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సురేష్ సారంగం విజువల్స్‌కు కలర్‌ఫుల్ టోన్ ఇవ్వగా, కాల భైరవ సంగీతం ట్రైలర్ ఎనర్జీకి తగ్గట్టుగా సింక్ అయింది. ఎడిటింగ్‌ను కార్తీక శ్రీనివాస్ , ప్రొడక్షన్ డిజైన్‌ను నార్ని శ్రీనివాస్ అందించారు.

మొత్తానికి ట్రైలర్ చూస్తే ఈ సినిమా సరదాగా ఎంటర్‌టైన్ చేయడానికి, నవ్వులు పంచడానికి వచ్చిన వినూత్న ప్రయత్నం. ‘జెట్‌లీ’ తన పూర్తి మ్యాడ్‌నెస్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సత్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రితేష్ కథ చెప్పగానే చాలా నచ్చింది. ఈ క్యారెక్టర్ చాలా నచ్చి సినిమా చేశాను. ఇందులో క్యారెక్టర్ హీరోలా కాకుండా కామెడీ స్పెష్ లోనే వుంటుంది. యాక్షన్ కామికల్ గానే వుంటుంది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ తో జరిగే ఇంటరాక్షన్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ప్రతి సెగ్మెంట్ ని చాలా ఎంజాయ్ చేశాను. రితేష్ స్టయిల్ లో వర్క్ చేయడంతో ఇంట్రస్టింగ్ గా వుంటుంది. ఈ సినిమాలో చిరంజీవి గారి రిఫరెన్స్ లు వుంటాయి. మే1న అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ రితేష్ రానా మాట్లాడుతూ.. ఇది యాక్టర్ ని బట్టి డిజైన్ అయ్యే స్టొరీ. సత్య అనుకున్నప్పుడు తన స్టయిల్ క్యారెక్టరైజేషన్ బట్టి స్క్రిప్ట్ ని డిజైన్ చేశాం. సత్య యాడ్ అవ్వడం వలన కామెడీ మరింత ఎలివేట్ అయ్యింది. సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. మిషన్ ఇంపాజిబుల్ సినిమా సత్యతో తీస్తే ఎలా వుంటుందో ‘జెట్లీ’ అలా వుంటుంది. ఇందులో యాక్షన్ కామెడీ ట్విస్ట్ లు అన్నీ వుంటాయి. తెలుగులో ఈ సినిమా చాలా కొత్తగా వుంటుంది.

ప్రొడ్యూసర్ చెర్రీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాను ఐదు నెలల ఐదు రోజుల్లో షూటింగ్, ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేశాం. నిర్మాతగా ఇంతకంటే కావాల్సింది ఏమీలేదు. డైరెక్టర్ రితేష్ కి థాంక్ యూ. ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. సత్య, వెన్నెల కిషోర్ గారు చాలా బిజీగా ఉండే ఆర్టిస్టులు అయినప్పటికీ ఎంతో కోఆపరేట్ చేశారు. ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన యూఎస్పీ ఉంది. దాదాపు 80 శాతం షూటింగ్ ఫ్లైట్‌లోనే చేశాం. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో అలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. ఫ్లైట్‌లో జరిగే సంఘటనలు, కామెడీతో ఈ సినిమా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. రితేష్ తనదైన స్టైల్‌లో మంచి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇది ఒక మంచిథ్రిల్లర్. నిజానికి ముందుగా పెద్ద హీరోగా ఇంటెన్స్ థ్రిల్లర్‌గా చేయాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. తర్వాత కామెడీ థ్రిల్లర్‌గా మార్చాం. కామెడీ అంటే రితేష్ కి ముందుగా గుర్తొచ్చే పేరు సత్య.సత్య, వెన్నెల కిషోర్ ఇద్దరినీ తీసుకుని ఈ సినిమా చేశాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. మే 1న అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. ఇందులో నా పేరు మీరు నేరుగా థియేటర్‌లో తెలుసుకోవాలి. నేను దుబాయ్ నుంచి ఫ్లైట్‌లో వస్తున్నప్పుడు, ఆ ఫ్లైట్‌లో ఊహించని చిత్రవిచిత్రాలు జరుగుతాయి. నేను టిఎఫ్ఐ బానిసను. కథ చెప్పగానే క్లూస్ పట్టేస్తుంటాను. టైమ్ పాస్ కోసం ఒక సినిమా సుడోకు గేమ్ ఆడుతుంటాను. ఆ గేమ్ నేను పూర్తి చేశానా లేదా అనేది మే 1న ‘జెట్‌లీ’ సినిమా చూసి తెలుసుకోవాలి.

హీరోయిన్ రియా సింఘా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇందులో నా పేరు శివాని. నా పాత్ర ఎలా ఉంటుందో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. మొత్తం ఫ్లయిట్ లో చేసిన సినిమా ఇది. ఆడియన్స్ కి చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందులో నేను ఫాదర్ ఫీనిక్స్ అనే పాత్ర చేస్తున్నాను. కొందరు శైతాను రక్షకులు. వాళ్ళతో చాలా డేంజర్. నాకు ఫ్లైట్‌లో ఎదురైన సంఘటన ఏమిటో, అది ఎలా మారిందో మే 1న మీరు థియేటర్‌లో చూసి తెలుసుకోవాలి.

గుండు సుదర్శన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇందులో నేను నూర్జహాన్ అనే పాత్రలో కనిపిస్తాను. నాకు ఫ్లైట్‌లో ఒక ఆపరేషన్ జరుగుతుంది. దాని వల్ల పెద్ద గొడవ ఏర్పడుతుంది. అది ఏమిటో మే 1న సినిమా చూసి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.

తారాగణం: సత్య, రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: రితేష్ రానా
నిర్మాతలు: క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ (చిరంజీవి (చెర్రీ) హేమలత పెదమల్లు
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్ (నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి)
కథ – స్క్రీన్ ప్లే: రితేష్ రానా & జయేంద్ర ఎరోలా
డైలాగ్స్: రితేష్ రానా
సంగీతం: కాల భైరవ
D.O.P: సురేష్ సారంగం
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్: తేజ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి
కో-డైరెక్టర్: చుక్కా విజయ్ కుమార్
డైరెక్షన్ గ్యాంగ్: ప్రభావ్ కర్రి, పి.వి.సాయి సోమయాజులు, విక్రమ్ రామిరెడ్డి, కౌశిక్ రాజు
పోస్టర్లు: శ్యామ్
PRO: వంశీ – శేఖర్

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments