టైటిల్‌తోనే ఆసక్తి రేపడం అనిల్ రావిపూడి స్టైల్. ఇప్పుడు మరోసారి అదే చేశారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో ఆయన తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌కు “జనవరి 12 విడుదల” అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారు. విశేషం ఏమిటంటే… సినిమా కూడా 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుండడం.
టైటిల్‌కు “బావ బామ్మర్ది సౌజన్యంతో…” అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌ను జోడించారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం రూపొందించిన ఫన్నీ వీడియోలో వెంకటేష్, కళ్యాణ్‌రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి కలిసి అనిల్‌ను సినిమా పేరేంటని అడగడం… ఆయన మాత్రం పదేపదే “జనవరి 12 విడుదల” అని చెప్పడం ఆకట్టుకుంది!!

