రజనీకాంత్ – దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘జైలర్ 2’ తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ భారీ సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అక్టోబర్ 15, 2026న ప్రేక్షకు ముందుకు రాబోతోంది. పార్ట్ 1 తరహాలోనే పార్ట్ 2 కూడా పెద్ద విజయం సాధిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి!!

