HomeEntertainmentఆఖరి శ్వాస వరకు ఐకాన్ స్టార్ ని అంటి పెట్టుకుని ఉంటాను

ఆఖరి శ్వాస వరకు ఐకాన్ స్టార్ ని అంటి పెట్టుకుని ఉంటాను

- Advertisment -

-ఫిల్మ్ పబ్లిసిటీ స్ట్రాటజిస్ట్
టర్నడ్ ప్రొడ్యూసర్
శరత్‌చంద్ర నాయుడు

పడేళ్లకు పైగా శరత్ చంద్ర నాయుడు…. తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాల మార్కెటింగ్, డిజిటల్ ప్రచార కార్యక్రమాల వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు నిర్మాతగా అరంగేట్రం చేశారు. శరత్ చంద్ర నిర్మించగా… ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న “గుర్తుకొస్తున్నాయి” వెబ్‌సీరిస్‌ నిర్మాతగా ఆయన ప్రయాణానికి మంచి శుభారంభాన్నిచ్చింది. ఈ సిరీస్‌ను నిర్మించడం మాత్రమే కాకుండా, దర్శకుడు వినోద్ మరియు రచయితల బృందంతో కలిసి సిరీస్‌లోని పలు భాగాలకు రచనలో కూడా శరత్ చంద్ర నాయుడు సృజనాత్మక సహకారం అందించారు. ప్రేక్షకుల భావోద్వేగాలపై, కథనంపై ఆయనకు ఉన్న అవగాహన తెరపై ప్రతిబింబిస్తూ, ఈ ప్రాజెక్ట్‌లో ఆయన పాత్రకు మరో కోణాన్ని జోడించింది.


ఈ సందర్భంగా శరత్ చంద్ర మాట్లాడుతూ… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండదండలు, ప్రోత్సాహం వల్లే… నిర్మాత కావాలన్న తన కల సాకారమయ్యిందని పేర్కొన్నారు. ఆఖరి శ్వాస వరకు అల్లు అర్జున్ ని అంటి పెట్టుకుని ఉంటానని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు ఫిల్మ్ పబ్లిసిటీ స్ట్రాటజిస్ట్ టర్నెడ్ ప్రొడ్యూసర్ శరత్ చంద్ర నాయుడు!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments