సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి… శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా ట్రాన్స్‌జండర్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా “ఎల్ జి బీ టీ”– ఏ లీగల్ బ్యాటిల్ “. జూన్ 19న విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఈ చిత్ర బృందాన్ని అభినందిస్తూ … ఫిలిం ఛాంబర్‌లో “మీట్ ది ప్రెస్” కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు పి. సునీల్‌కుమార్ రెడ్డి, ఎల్.బి. శ్రీరామ్ లను క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బత్తుల ప్రసాద్, సెక్రట్రీ సురేష్ కొండేటి అభినందించారు. వల్లూరి రాఘవరావు వ్యాఖ్యాతగా చిత్ర బృందంలోని ప్రతి పాత్ర గురించి అద్భుతంగా వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళారు!!

