HomeEntertainmentస్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, 'మైత్రీ' రవిశంకర్ చేతుల మీదుగా ఘనంగా హీరో కిరణ్ అబ్బవరం...

స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, ‘మైత్రీ’ రవిశంకర్ చేతుల మీదుగా ఘనంగా హీరో కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” సినిమా ట్రైలర్ రిలీజ్

- Advertisment -

-గ్లింప్స్ రిలీజ్ నుంచే “చెన్నై లవ్ స్టోరీ”కి అభిమానిగా మారాను – ప్రొడ్యూసర్ రవిశంకర్

-ట్రైలర్ చూస్తుంటే “చెన్నై లవ్ స్టోరీ” తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం కలుగుతోంది – ప్రొడ్యూసర్ అల్లు అరవింద్

-ట్రైలర్ లో మీరు చూసింది తక్కువే, సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉంటాయి – డైరెక్టర్ రవి నంబూరి

-“చెన్నై లవ్ స్టోరీ”లో కిరణ్, గౌరి పర్ ఫార్మెన్స్ చూస్తూ రోజూ మురిసిపోతున్నాం – స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్

-“చెన్నై లవ్ స్టోరీ” ఒక ప్యూర్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ – హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ

-మా అందరి జీవితాల్లో “చెన్నై లవ్ స్టోరీ” ఒక పెద్ద విజయాన్ని అందించబోతోంది – కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని

-“చెన్నై లవ్ స్టోరీ” ట్రైలర్ కు వంద రెట్లు సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, నాది గ్యారెంటీ – ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

-నా అభిమానులంతా గర్వపడే సినిమా “చెన్నై లవ్ స్టోరీ” – హీరో కిరణ్ అబ్బవరం

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా “చెన్నై లవ్ స్టోరీ”. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు “చెన్నై లవ్ స్టోరీ” మూవీ రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ అతిథులుగా పాల్గొన్నారు. అల్లు అరవింద్ చేతుల మీదుగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ రవిశంకర్ బర్త్ డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments