HomeEntertainmentహైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్-2

హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్-2

- Advertisment -

2027 జనవరి 27 – 31

గతేడాది విశేషంగా ఆకట్టుకున్న “హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్” సీజన్-2గా మళ్ళీ మన ముందుకు రాబోతుంది. దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్, తెలంగాణా గవర్నమెంట్ యూత్ అడ్వాన్స్‌మెంట్, కల్చర్ అండ్ టూరిజమ్ సహకారంతో హైదరాబాద్ వేదికగా 2027 జనవరి 27 నుంచి 31 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది!!

ఈ ప్రతిష్టాత్మక ఫెస్టివల్ కర్టెన్ రైజర్ కార్యక్రమం పర్యాటక భవనంలో జరిగింది, ఇందులో రచనా బాహుబలి, దర్శకులు, ఎం.పి. విజయేంద్ర ప్రసాద్ గారు, వై.ఎ.టి. సి (Youth Advancement Tourism and Culture) స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి వాణీ ప్రసాద్, ఐ.ఏ.ఎస్, టూరిజమ్ ఎం.డి. శ్రీమతి క్రాంతి, ఐ.ఏ.ఎస్,. ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తున్న దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ బాధ్యులు “అంకురం” ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు!

శ్రీమతి క్రాంతి మాట్లాడుతూ… “హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచం నలుమూలల నుంచి ఊహించనన్ని చిత్రాలతో, ప్రఖ్యాత జ్యూరీ సభ్యులతో, యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకోనుంది” అని అన్నారు!!

శ్రీమతి వాణీ ప్రసాద్ మాట్లాడుతూ…. “హెచ్.ఐ.ఎస్.ఎఫ్.ఎఫ్ సెకండ్ సీజన్‌గా వస్తున్నందుకు హర్షం వ్యక్తం చేసారు. ఇందులో కీలక బాధ్యత పోషిస్తున్న దాదా సాహెబ్ ఫాల్కేని అభినందించారు. ఇలా యువతరాన్ని సంస్కృతికి ఎక్స్‌పోజ్ చేసి సామాజిక బాధ్యతను స్ఫురింపజేసే కార్యక్రమాల్ని తెలంగాణ ప్రభుత్వం తరపున గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ప్రోత్సహిస్తారని పేర్కొన్నారు!

విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… “యువతరంలో వున్న సృజనాత్మకత, క్రియాశీలతల్ని ఉపయోగించుకోవాలని, వాళ్ళ చేత షార్ట్ ఫిల్మ్స్ తీయించాలని కోరారు. శ్రీమతి వాణీ ప్రసాద్ గారు అభినందనీయులని అన్నారు.

దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ప్రిన్సిపాల్ నందన్ బాబు మాట్లాడుతూ… “తాము నెలకి రెండు షార్ట్ ఫిలిమ్స్ తీయటానికి వీలు కల్పిస్తున్నట్లు చెప్పారు.

అంకురం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… “ఈ ప్రపంచం ఒక్కటే- మనది వసుధైక కుటుంబం – ఎల్లలు, వేర్పాట్లు మానవ సంస్కృతికి విరుద్ధమనే కాన్సెప్ట్ తోనే హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పడిందని, ఇప్పుడు నిర్వహించే సీజన్ 2 కి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ డిగ్నిటరీస్ అడ్వైజరీ బోర్డ్ ఏర్పడిందని, ఈ సందర్భంగా 5 రోజుల ఫిల్మ్ ఎక్స్‌పో కూడా జరుగుతుందని తెలిపారు!!

శ్రీమతి వాణీ ప్రసాద్ , స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫెస్టివల్ కార్యక్రమాలకి నాంది పలికారు. గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కార్యక్రమం విజయవంతం కావాలని సందేశం పంపారు. అలానే ప్రపంచ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జ్యో పాలో మాచిడో మొదలుగా ఆ అడ్వైజరీ బోర్డు, జ్యూరీ బోర్డు సభ్యులు తమ సందేశాలు పంచుకున్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments