HomeEntertainmentతెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు రూ.4 లక్షల చెక్కును అందించిన హీరో కృష్ణసాయి

తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు రూ.4 లక్షల చెక్కును అందించిన హీరో కృష్ణసాయి

- Advertisment -

▪️ రెడ్ క్రాస్ సొసైటీకి మద్దతుగా విరాళం
▪️ అభినందించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

హైదరాబాద్: టాలీవుడ్ హీరో కృష్ణసాయి తన సేవా కార్యక్రమాలతో మరోసారి ప్రశంసలు అందుకున్నారు. తన ఆధ్వర్యంలో నడుస్తున్న ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా సమాజ సేవలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలకు మద్దతుగా తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు రూ.4 లక్షల చెక్కును విరాళంగా అందించారు. హైదరాబాద్‌లోని లోక్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో యువతకు ఆదర్శంగా నిలుస్తూ సేవాభావంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న కృష్ణసాయిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లు అంశాల‌పై వీరిద్ద‌రు చ‌ర్చించుకున్నారు.

కృష్ణసాయి తన ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, వైద్య సహాయం, అవసరార్థులకు నిత్యావసరాల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా చైతన్యం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ యువతలో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని గవర్నర్ ప్రశంసించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, కృష్ణసాయి ప్రస్తుతం పలు అప్‌కమింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కృష్ణసాయి ముఖ్య పాత్రలో నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ త్వరలో విడుదల కానుంది. ఒకవైపు సినీ రంగంలో తన ప్రతిభను చాటుకుంటూనే, మరోవైపు సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలుస్తుండటం విశేషం. సినీ నటుడిగా మాత్రమే కాకుండా సేవామూర్తిగా కూడా కృష్ణసాయి మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments