ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న మూవీ “గోల్డ్ స్పాట్”. విజయకృష్ణ లింగమనేని సమర్పణలో రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్, కాజల్ చౌదరి జంటగా నటిస్తున్నారు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. శ్రీ చౌదరి ఇనగంటి సహ నిర్మాత. దుష్యంత్ దగ్గర వర్క్ చేసిన వేణు కార్తికేయన్ “గోల్డ్ స్పాట్” సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. “గోల్డ్ స్పాట్” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘పరిచయమే..’ రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ నరేన్ రెడ్డి సింగర్ తుషార నిలయతో కలిసి పాడారు. భార్గవ కార్తీక్ క్యాచీ లిరిక్స్ అందించారు!!

