తరుణ్ భాస్కర్ న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ ‘గాయపడ సింహం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రం కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో మే 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ సాదినేని సమర్పణలో ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు.
ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ట్రైజర్, ఉర్రూతలూగించే పాటలతో మంచి బజ్‌ను సృష్టించింది, తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఉత్సాహాన్ని మరింత పెంచింది. వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు!!

