HomeEntertainmentదర్శక దిగ్గజానికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఘన నివాళి

దర్శక దిగ్గజానికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఘన నివాళి

- Advertisment -

దర్శక దిగ్గజానికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఘన నివాళి

తెలుగు సినీ యవనికపై ‘దర్శకరత్న’గా వెలుగొందిన శ్రీ దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా, ఆయన స్మృత్యర్థం ఇదిగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అక్షరాంజలి:!!

దర్శకరత్న – దాసరి నారాయణరావు గారికి కలం కన్నీటి నివాళి!!

పాలకొల్లు మేధస్సు.. పద్మవ్యూహాలను ఛేదించిన సాహసం!!
ఎడారి ఎండమావి వంటి సినీ స్వప్నా లను నిజం చేసి సేదతీర్చిన ఓయాసీస్సు!!

వెండితెరపై సామాన్యుడి సంతకం..

మీరే తెలుగువారి ఆత్మగౌరవం!

‘తాత-మనవడు’తో మొదలైన మీ ప్రస్థానంఅంచెలంచెలుగా ఎదిగి విశ్వ విఖ్యాత సినీ
‘మేధావి’గా ప్రపంచ ఖ్యాతి

150 చిత్రాల మేటి కెప్టెన్..

గిన్నిస్ బుక్ గర్వించిన దర్శకరత్నవు మీరు

బొబ్బిలి పులి గర్జనలో సమాజపు ఆవేదన

ప్రేమాభిషేకపు విరహంలో గుండెలోతు వేదన

ప్రతి దృశ్యంలోనూ ఒక సామాజిక చైతన్యం

ప్రతి మాటలోనూ ఒక అద్భుత సమ్మోహనం!

మీరు లేని లోటు తీర్చలేనిది..

మీరు వేసిన బాట చెరిగిపోనిది..
అక్షరాల అమరజ్యోతివి.. కళామతల్లి కంటిపాపవి.
.జయహో దర్శకరత్న.. నీ కీర్తి అజరామరం!

విషాద వినమ్ర హృదయాలతో 🌹🌹🌹

అధ్యక్ష / కార్యదర్శులు
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments