HomeEntertainmentపూజా కార్యక్రమంతో ప్రారంభమైన లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ ఈవీవీ సినిమా ప్రొడక్షన్ నెం.10, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్...

పూజా కార్యక్రమంతో ప్రారంభమైన లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ ఈవీవీ సినిమా ప్రొడక్షన్ నెం.10, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం.1: హర్ష్ రోషన్, ప్రియాంక ఆచర్ జంటగా నూతన చిత్రం ప్రారంభం

- Advertisment -

తెలుగు సినిమా రంగంలో ఐకానిక్, పేరెన్నికగన్న నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈవీవీ సినిమా ప్రతిష్ఠాత్మకంగా తాజాగా ఓ వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లెజెండరీ దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ స్థాపించిన ఈ బ్యానర్‌పై గతంలో ‘చాలా బాగుంది’, ‘మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది’, ‘తొట్టి గ్యాంగ్’, ‘అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ’, ‘ఫిట్టింగ్ మాస్టర్’, నువ్వంటే నాకిష్టం, కితకితలు వినోదాత్మక చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ఈ లెజండరీ బ్యానర్‌పై ఈవీవీ గారి తనయుడు ఆర్యన్‌ రాజేష్‌ మరో నిర్మాత ఎన్‌.వి.కృష్ణారెడ్డితో కలిసి ఓ సినిమా నిర్మంచబోతున్నారు. నిజ జీవిత కథ ఆధారంగా ఓ ఇంటెన్స్ లవ్ డ్రామాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హర్ష్ రోషన్ హీరోగా, ప్రియాంక ఆచర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘కోర్ట్’ చిత్రంతో మంచి ప్రశంసలు అందుకున్న హర్ష్ రోషన్, తెలుగు సినిమాలో ప్రతిభావంతులైన యువ నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు మరో భావోద్వేగ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ చిత్రానికి అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు. నిజ జీవిత భావోద్వేగాలు, సంబంధాల నేపథ్యంలో ఈ ప్రేమకథను వారు రూపొందించారు. ఈ సినిమా ఇటీవల శుభ ముహూర్తంలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈవీవీ సినిమా, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వాస్తవికత, తీవ్ర భావోద్వేగాలు, బలమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

నటీనటులు: హర్ష్ రోషన్, ప్రియాంక ఆచర్ తదితరులు

సాంకేతిక బృందం:

బ్యానర్లు: ఈవీవీ సినిమా, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: ఎన్.వి. కృష్ణారెడ్డి, ఆర్యన్ రాజేష్,
దర్శకులు: అరుణ్ బాలాజీ, శ్రీ రంజని
డీఓపీ: జిజు సన్నీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినీల్ నల్లమిల్లి
మార్కెటింగ్: విష్ణు తేజ్ పుట్ట
పీఆర్వో: మడూరి మధు

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments