Friday, December 5, 2025
HomeNewsఅక్కడ గంట కొట్టిన ఘనత బాలయ్యదే

అక్కడ గంట కొట్టిన ఘనత బాలయ్యదే

- Advertisment -

గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ మరో చరిత్ర సృష్టించారు. దేశంలోని ప్రతిష్టాత్మక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌ (NSE)లో బెల్ మోగించిన తొలి దక్షిణ భారత నటుడిగా గౌరవం దక్కించుకున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం బాలకృష్ణ ఎన్‌ఎస్‌ఈ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయనతోపాటు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్ఎస్ఈలో బెల్ మోగించే గౌరవం పారిశ్రామిక దిగ్గజాలు, సంస్కరణకారులు, జాతీయ ప్రాధాన్యత కలిగిన వ్యక్తులకే లభిస్తుంది. ఆ జాబితాలో బాలకృష్ణ చేరడం విశేషం. ఇటీవలే బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కిన విషయం తెలిసిందే. ఆయన నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం అఖండ 2 సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments