Saturday, December 13, 2025
HomeEntertainment"అన్నగారు వస్తారు" నాకు ఒక ఛాలెంజింగ్ మూవీ. ఇలాంటి డిఫరెంట్ సినిమాను మీ ముందుకు తీసుకురావడం...

“అన్నగారు వస్తారు” నాకు ఒక ఛాలెంజింగ్ మూవీ. ఇలాంటి డిఫరెంట్ సినిమాను మీ ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తి

- Advertisment -

స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “అన్నగారు వస్తారు” ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

లిరిసిస్ట్ రాకేందు మౌళి మాట్లాడుతూ – విభిన్నమైన కథా చిత్రాలు చేసి మెప్పిస్తూ విజయవంతమైన అతి కొద్ది మంది హీరోల్లో కార్తి ఒకరు. ఆయన నాకు బిగ్ ఇన్సిపిరేషన్. ఆవారా, ఖాకీ, యుగానికి ఒక్కడు..వంటి చిత్రాల్లెన్నో కార్తి వర్సటైల్ నటనను చూపిస్తాయి. “అన్నగారు వస్తారు” సినిమా వైల్డ్ లైఫ్ సవారీలా ఉంటుంది. ఈ సినిమాలో అన్ని పాటలు రాశాను. మూవీ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.

డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ – యుగానికి ఒక్కడు మూవీ చూసి ఈ హీరో చాలా బాగా నటిస్తున్నాడు అనిపించింది. ఆ తర్వాత ఆవారా చూసి ఫ్యాన్ అయ్యాను. యుగానికి ఒక్కడు, ఆవారా సినిమాల్లో నటించింది ఒక్కరేనా అనిపించేంత వేరియేషన్ చూపించారు. నా పేరు శివ సినిమా తర్వాత కార్తి గారి సినిమాలు మిస్ కాకూడదు అని ఫిక్స్ అయ్యా. అన్నగారు వస్తారు సినిమా ట్రైలర్ కొత్తగా ఉంది. నలన్ కుమారస్వామి గారి సూదు కవ్వం సినిమా నా ఫేవరేట్ మూవీ. కృతి శెట్టి ఉప్పెన టైమ్ నుంచి కార్తితో కలిసి నటించాలని డ్రీమ్ గా పెట్టుకుంది. మైత్రీ రిలీజ్ చేసే సినిమాలు మంచి సక్సెస్ అవుతాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.

డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ – కార్తి గారికి నేను పెద్ద అభిమానిని. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు, డైరెక్టర్ అయ్యాక…ప్రతి టైమ్ లో ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాను, ఇన్స్ పైర్ అవుతూనే ఉన్నాను. కార్తిని మనమంతా మన హీరోగానే భావిస్తాం. ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు ఎప్పుడూ డబ్బింగ్ మూవీలా అనిపించదు. తెలుగు హీరో చేసినట్లు ఆడియెన్స్ ఆదరిస్తారు. నలన్ కుమారస్వామి గారు దర్శకుడిగా మా అందరినీ ఇన్స్ పైర్ చేశారు. అన్నగారు వస్తారు ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. అన్నారు.

డైరెక్టర్ దేవ కట్టా మాట్లాడుతూ – నేను చెన్నైలో పెరిగాను. బాలచందర్, భారతీరాజా గారి సినిమాల ప్రభావం నాపై ఉండేది. కొన్ని సినిమాలు చూసినప్పుడు మనకు జ్వరం తెప్పిస్తాయి. నన్ను అలా కదిలించిన సినిమా కార్తి గారి పరుత్తి వీరన్. ఆయన తొలి సినిమాతోనే సిక్సర్ కొట్టారు. యుగానికి ఒక్కడు సినిమాకు తెలుగులో మాస్ ఆడియెన్స్ నుంచి వచ్చిన స్పందన అనూహ్యం. కార్తి గారితో వర్క్ చేయాలని అనిపించేది. తెలుగు మీద కార్తి గారికి చాలా అభిమానం అందుకే ఆయన తన తొలి చిత్రం నుంచి తెలుగులోనే సొంతంగా డబ్బింగ్ చెబుతున్నారు. ఆయన డబ్బింగ్ కోసం తమిళంతో పాటు తెలుగు వెర్షన్ చూస్తుంటా. తెలుగులో ప్రతి హీరో అభిమాని కార్తి గారికి అభిమాని. అలాంటి ప్రేమను కార్తి సంపాదించుకున్నారు. అన్నారు.

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ – ఇటీవల ఒక సందర్భంలో కార్తి గారిని కలిశాను. ఆయన ఎంత మంచి యాక్టరో అంత మంచి వ్యక్తిత్వం ఉన్నవారు. కాసేపు మాట్లాడితేనే ఎంతోకాలంగా పరిచయం ఉన్న వ్యక్తి అనే ఫీల్ కలిగింది. మనకు తెలుగులో నాని గారు ఎలా డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారో, కార్తి గారు కూడా మనకు అలాంటి మూవీస్ తీసుకొస్తున్నారు. నలన్ కుమారస్వామి గారు గ్రేట్ టెక్నీషియన్. ఆయన ఒక ఫాంటసీ జానర్ లో అన్నగారు వస్తారు సినిమా రూపొందించడం ఆసక్తి కలిగిస్తోంది. నేను ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ సినిమా చూడాలని ఫిక్స్ అయ్యాను. అన్నారు.

డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ – ఈ ఈవెంట్ కు నేను రావడానికి కృతి శెట్టి ఫస్ట్ రీజన్. తను నాకు సోదరి లాంటిది. సెకండ్ రీజన్ కార్తి గారు. ఆయన సత్యం సుందరం సినిమా చూసి ఇప్పుడున్న సొసైటీకి ఇలాంటి మూవీ కావాలి, ఆ సినిమా గురించి కార్తి గారితో మాట్లాడాలి అనుకున్నా. మూడో కారణం డైరెక్టర్ నలన్ కుమారస్వామి. ఆయన సూదు కవ్వం సినిమా నన్ను సర్ ప్రైజ్ చేసింది. కార్తి ఎంతమంచి వ్యక్తి అనేది నా వైఫ్ చిన్మయి చెబుతుంటుంది. అన్నగారు వస్తారు సినిమాను నేను మొదటి రోజే చూడాలని అనుకుంటున్నా. జ్ఞానవేల్ గారికి ఇతర టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్. అన్నారు.

డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ – కార్తి గారిని హిట్ ఫ్రాంఛైజీలోకి తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. నాపై ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నలన్ కుమారస్వామి ఎప్పుడూ న్యూ ఏజ్ కంటెంట్ చేస్తుంటారు. ఈ సినిమాను కూడా అలాగే రూపొందించినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. ట్రైలర్ లో కార్తి గారిని చూడగానే ఇది ఆయన జోన్ అనిపించింది. ఆ జోన్ లో కార్తిని చూసి ఎంజాయ్ చేయబోతున్నాం. తెలుగు ఆడియెన్స్ టికెట్ కొని సినిమా చూడటమే కాదు కార్తిని ఎంతో లవ్ చేస్తారు. అలాంటి అదృష్టం చాలా కొద్దిమంది హీరోలకు దక్కుతుంది. అన్నారు.

మైత్రీ డిస్ట్రిబ్యూషన్ శశిధర్ మాట్లాడుతూ – మా దగ్గరకు వచ్చే ట్రైలర్ ను మిత్రులకు పంపిస్తుంటా. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. అలా అన్నగారు వస్తారు ట్రైలర్ ను పంపిస్తే ప్రతి ఒక్కరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మా సంస్థ ద్వారా రిలీజ్ చేస్తుండటం హ్యాపీగా ఉంది. అన్నారు.

ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ – సూర్య గారితో, జ్ఞానవేల్ రాజా గారితో మాకు మంచి అనుబంధం ఉంది. కార్తి గారి పరుత్తి వీరన్ సినిమాకు థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ ఇంకా నేను మర్చిపోలేదు. ఈ రోజు ఈ ఈవెంట్ కు ఇంతమంది యంగ్ డైరెక్టర్స్ వచ్చారంటే దానికి కార్తి గారి మీద వారికి ఉన్న అభిమానమే. కొత్త దర్శకులతో విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు కార్తి. నలన్ కుమారస్వామి టాలెంటెడ్ డైరెక్టర్. మీ కాంబోలో వస్తున్న అన్నగారు వస్తారు సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ – మీ అందరి కేరింతలు చూస్తుంటే సంతోషంగా ఉంది. ఉప్పెన టైమ్ లో కార్తి గారిని చూడాలనే డ్రీమ్ ఉండేది. ఇప్పుడు ఆయనతో కలిసి నటించే అవకాశం దక్కింది. ఆయన తనతో పాటు తనతో ఉన్న అందరూ ఎదిగేలా ఎంకరేజ్ చేస్తారు. తమిళంలో నా డెబ్య్యూకు ఇంతకంటే మంచి మూవీ, ఇంతకంటే మంచి కోస్టార్ దొరకరేమో. అలాంటి స్పేస్ ను నాకు కల్పించారు. అందుకు కార్తి గారికి థ్యాంక్స్. ఆయనకు నా ఫ్యానిజం చూపిస్తుంటా. కార్తి తెలుగు హీరోనే అనే భావన తెలుగు ఆడియెన్స్ లో ఉంది. తెలుగు ఆడియెన్స్ తమకు నచ్చిన హీరోను ప్రేమిస్తారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది చూడరు. అది తెలుగు ఆడియెన్స్ గొప్పదనం. తెలుగు ఆడియెన్స్ కు హాట్సాఫ్. నాకు డైరెక్షన్ చేయాలనే కోరిక ఉంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తే నలన్ గారి దగ్గరే వర్క్ చేస్తా. నలన్ కుమారస్వామి ఈ చిత్రంలో ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. ఆ వరల్డ్ ను ఈ నెల 12న థియేటర్స్ లో చూస్తారు. 60 దశకం నుంచి కమర్షియిల్ సినిమాకు ఉన్న ఛార్మ్, ఒక మాయ. ఆ మాయను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లేవారు. అలాంటి ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు అన్నగారు వస్తారు సినిమాను చేశాం. మీరంతా మా మూవీని ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – కార్తి గారి కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నగారు వస్తారు సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. కార్తి, కృతి శెట్టికి ఈ సినిమా సూపర్ హిట్ అందించాలి. ఈ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ . అన్నారు.

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ – మనకు సినిమా అంటే పిచ్చి. భాష, ప్రాంతం అని చూడకుండా సినిమాను ఇష్టపడతాం. హీరోలను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తుంటాం కానీ కార్తి, సూర్య థియేటర్స్ నుంచి మనతో పాటే ఇంటికి వచ్చి మన ఫ్యామిలీ మెంబర్స్ లా మారిపోయారు. కార్తి గారి సినిమాల సెలెక్షన్ ను అభిమానిస్తా. ఆయన ప్రతిసారీ ఒక భిన్నమైన మూవీతో మన ముందుకు వస్తుంటారు. కార్తి గారు నటించిన సత్యం సుందరం సినిమా చూసి నేనే కాదు మా పాప కూడా కన్నీళ్లు పెట్టుకుంది. నలన్ కుమారస్వామి గారు కల్ట్ డైరెక్టర్. కృతి శెట్టి ఉప్పెన తర్వాత మంచి సినిమాలు లైనప్ చేసుకుంటూ వస్తోంది. కార్తితో కలిసి నటించాలని కోరుకుంది, ఈ రోజు నటించింది. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ – కార్తి అన్నను కాలేజ్ లో నా సీనియర్ లా భావిస్తా. యంగ్ హీరోలు ఇలాంటి మూవీ చేయాలని కోరుకునే మూడు సినిమాల్లో ఒకటి కార్తి అన్నది ఉంటుంది. అలాంటి వైవిధ్యమైన చిత్రాల్లో కార్తి అన్న నటించారు. ఆయనను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తున్నప్పుడు నన్ను తమిళ ఆడియెన్స్ ఇష్టపడరా అనే నమ్మకంతో కోలీవుడ్ వెళ్లాను. కోలీవుడ్ లో నాకు ప్రతిసారీ తన సపోర్ట్ అందిస్తుంటారు కార్తి అన్న. నలన్ కుమారస్వామి గారు గొప్ప దర్శకుడు. కృతి శెట్టికి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తే సక్సెస్ అందుకున్నట్లే. జ్ఞానవేల్ రాజా గారు నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్. అన్నగారు వస్తారు సినిమా ఘన విజయం సాధించాలి. అన్నారు.

హీరో కార్తి మాట్లాడుతూ – ఈ వేదిక మీద ఉన్న ప్రతి దర్శకుడు, ప్రతి గెస్ట్ మాట్లాడిన మాటలు నా మనసును తాకాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. శివ నిర్వాణ నేను కలిసి ఒక సినిమా చేయాలనుకున్నాం. దేవ కట్టా గారి ప్రస్థానం నా ఫేవరేట్ మూవీ. బాబీ గురించి వంశీ పైడిపల్లి ఎప్పుడూ చెబుతుండేవాడు. వెంకీ కుడుముల ఒక హిలేరియస్ స్క్రిప్ట్ చెప్పాడు. త్వరలో ఆ మూవీ ప్లాన్ చేద్దాం. వివేక్ మంచి రైటర్. ఆయన నేను ఇటీవల కలిశాం. మళ్లీ మీట్ కావాలనుకుంటున్నాం. నా ప్రతి సినిమా రిలీజ్ తర్వాత చిన్మయి నుంచి ఒక పేజ్ మెసేజ్ వస్తుంది. అది రాహుల్ రాసింది. చిన్మయి రాహుల్ మెసేజ్ లు నాకు కొరియర్ లా పంపిస్తుంటుంది. వీళ్లంతా నా మీద చూపిస్తున్న ప్రేమకు చాలా థ్యాంక్స్. శైలేష్ నాతో హిట్ 3లో చిన్న కేమియా చేయించారు. అందులో నేను చెప్పిన ఒక్క డైలాగ్ ఎంతో పాపులర్ అయ్యింది. ఆ చిన్న సీన్ కు చాలా బ్యాక్ స్టోరీ రాశారు శైలేష్. మా కాంబోలో వస్తున్న హిట్ 4 కోసం నేను వెయిట్ చేస్తున్నా. సందీప్ నన్ను బాగా పొగిడి ఇబ్బంది పెట్టాడు. కృతి శెట్టి నా అభిమాని అని చెప్పింది. ఈ సినిమా కోసం ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేసింది. సెట్ కు వచ్చినప్పటి నుంచి తను ఆ పాత్ర మూడ్ లోనే ఉండిపోయేది. నలన్ కుమారస్వామి స్క్రిప్ట్ చెప్పినప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ ను ఊహించలేకపోయాను. ఎలా చేస్తుందని అనుకున్నాను. కానీ కృతి ఆ పాత్రలో ఆకట్టుకునేలా నటించింది. తను మంచి డ్యాన్సర్. నాతో కాస్త స్లోగా డ్యాన్స్ చేయమని చెప్పాను. అన్నగారు వస్తారు సినిమా గురించి చెప్పాలంటే. మనకు మన హీరోలంటే అభిమానం. మీరు నన్ను అభిమానిస్తారు. నేను నాకు ఇష్టమైన హీరోను అభిమానిస్తాను. ఆ అభిమానం ఒక దశ దాటితే భక్తి అవుతుంది. ఈ కాన్సెప్ట్ తో డైరెక్టర్ నలన్ అన్నగారు వస్తారు సినిమాను రూపొందించారు. ఇందాక కృతి చెప్పినట్లు 70, 80 దశకాల్లోని మాస్ కమర్షియల్ సినిమాకు ట్రిబ్యూట్ లా డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ కథకు ఒక సూపర్ హీరో లాంటి హీరో కావాలి. సూపర్ హీరో అంటే బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ లా ఎందుకు ఉండాలి. మన కల్చర్ లోనే ఒక ఎన్టీఆర్, ఎంజీఆర్ ఉన్నారు. వాళ్లు సినిమాను రాజకీయాలను ప్రజా జీవితాలను మార్చేశారు. హీరో తెరపై ఏం చేసినా మనం యాక్సెప్ట్ చేస్తాం. మనకు మన హీరోలే డెమీ గాడ్స్. వినోదంతో పాటు మనకు ఉపయోగపడే పని వాళ్లు తెరపై చేస్తే అది చాలా స్పెషల్ గా భావిస్తాం. చిన్న స్థాయి నుంచి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్, ఎంజీఆర్ మనకు సూపర్ హీరోస్. అలాంటి వాళ్లు మళ్లీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ కాన్సెప్ట్. నలన్ కుమారస్వామి గారికి తెలుగు దర్శకుల్లో ఇందరు అభిమానులు ఉన్నారనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆయన 8 ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. ఒక ఊహా ప్రపంచంలో ఈ స్టోరీ జరుగుతుంటుంది. ఇలాంటి గొప్ప పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదొక సవాల్ లాంటి సినిమా. ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ పాత్రలో నటించాను. ఇలాంటి టఫ్ సినిమాలను చేసినప్పుడే మనం నెక్ట్స్ లెవెల్ కు వెళ్లగలం అనిపించింది. బాగా నటించాననే అనుకుంటున్నా. మీ అందరికీ మా మూవీ నచ్చుతుంది. ఇలాంటి సినిమా మరోసారి చేయడం కష్టం. కొత్తదనం లేని సినిమాలు మీ ముందుకు తీసుకురావాలంటే భయపడతాను. సత్యం సుందరం సినిమా వచ్చినప్పుడు ఆ మూవీని తెలుగు ప్రేక్షకులు, మీడియా ఎంతగా సెలబ్రేట్ చేశారో చూశాను. ఆ క్రమంలో మరో డిఫరెంట్ సినిమాను తీసుకొస్తున్నామని చెప్పగలను. ఇలాంటి కొత్త తరహా చిత్రాలు నా దగ్గరకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ఎంతో శ్రమకోర్చి ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. నా తరుపున అన్నయ్య సూర్య తరుపున మీ అందరికీ నా కృతజ్ఞతలు. అన్నారు.

నటీనటులు – కార్తి, కృతి శెట్టి, సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – జార్జ్ సి. విలియమ్స్
ఎడిటింగ్ – వెట్రే కృష్ణన్
మ్యూజిక్ – సంతోష్ నారాయణన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – స్టూడియో గ్రీన్
నిర్మాత – కె. ఇ. జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం – నలన్ కుమారస్వామి

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments