Thursday, January 15, 2026
HomeEntertainmentఅఖిల్ అక్కినేని సినిమా ‘లెనిన్’ నుంచి ‘వారెవా వారెవా..’

అఖిల్ అక్కినేని సినిమా ‘లెనిన్’ నుంచి ‘వారెవా వారెవా..’

- Advertisment -

అఖిల్ అక్కినేని సినిమా ‘లెనిన్’ నుంచి ‘వారెవా వారెవా..’ లిరికల్ సాంగ్ రిలీజ్.. సమ్మర్‌లో విడుద‌ల కానున్న సినిమా

అఖిల్ అక్కినేని హీరోగా మనం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై ముర‌ళి కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తోన్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాను సోమ‌వారం రోజున ‘వారెవా వారెవా..’  అనే లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేవారు. ఈ పాట‌కు అభిమానులు, మ్యూజిక్ ల‌వ‌ర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ పాట‌ను అనంత శ్రీరామ్ రాయ‌గా.. శ్వేతా మోహ‌న్‌, జుబిన్ నౌటియాల్ త‌మ వాయిస్‌తో పాట‌కు ఓ ఎమోష‌న‌ల్ ఫీల్‌ను తీసుకొచ్చారు.

మ్యూజికల్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మన్ సంగీతం సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట‌ రొమాంటిక్ ఫీల్‌ను క‌లిగిస్తోంది.  సినిమాలోని భావోద్వేగాలను చక్కగా ప్రతిబింబిస్తూ, హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేసేలా పాట ఉంది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

శ‌ర‌వేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు 70 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసింది. మూవీని సమ్మర్‌లో రిలీజ్ చేయ‌టానికి మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్నారు.  ఈ సినిమాలో అఖిల్ అక్కినేని స‌ర‌స‌న భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గాన‌టిస్తోంది.

న‌టీన‌టులు:

అఖిల్ అక్కినేని, భాగ్య‌శ్రీ బోర్సె త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నిర్మాత‌లు:  అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
ద‌ర్శ‌క‌త్వం:  ముర‌ళి కిషోర్ అబ్బూరు
సంగీతం: త‌మ‌న్‌.ఎస్‌
Presented by: Annapurna Studios

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments