HomeEntertainmentమహేష్ బాబు మెచ్చుకోవడమే మాకు పెద్ద మైల్ స్టోన్

మహేష్ బాబు మెచ్చుకోవడమే మాకు పెద్ద మైల్ స్టోన్

- Advertisment -

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని అజయ్ భూపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పిస్తున్నారు.ఈ చిత్రం నేడు (జూలై 30న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి సినిమా విశేషాలు పంచుకున్నారు.

-ఇది కంప్లీట్ లవ్ స్టోరీ. అలాగే చాలా ఇంటెన్స్, ఎమోషనల్ స్టోరీ. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా. ఫిక్షన్ కథ. అయితే నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా కూడా కొన్ని సీన్స్ రాశాను. అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇందులో లవ్ స్టోరీతో పాటు సూపర్ ఎమోషన్స్ ఉంటాయి. మోహన్ బాబు గారి క్యారెక్టర్‌తో పాటు ఇంకా చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. పెద్ద నరేష్ గారి క్యారెక్టర్‌ను చాలా ఎంజాయ్ చేస్తారు.

-జై కృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుంది. తనను స్క్రీన్ మీద చూసినప్పుడు ఆడియన్స్ చాలా సర్ప్రైజ్ అవుతారు. రాషా తడానీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది.

-మహేష్ బాబు గారు సినిమా చూసి “అదిరిపోయింది” అని మెసేజ్ పెట్టారు. ముఖ్యంగా జై కృష్ణ, రాషా తడానీ జోడిని మెచ్చుకున్నారు. అలాగే సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయిందని చెప్పారు. సినిమా చాలా నచ్చిందని మెచ్చుకున్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments