పాన్ ఇండియా స్థాయిలో “బాలన్ – ది బాయ్” సినిమా పలువురు సెలబ్రిటీల ప్రశంసలు దక్కించుకుంటోంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఇలాంటి సినిమా గత రెండేళ్లలో రాలేదని అభినందించగా..ఇప్పుడు హీరో నాగచైతన్య “బాలన్ – ది బాయ్” సినిమాను అప్రిషియేట్ చేశారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆ మూవీ ఫీల్ లోనే ఉండిపోయానని, “బాలన్ – ది బాయ్” సినిమా మర్చిపోలేని అనుభూతికి గురిచేసిందని అన్నారు. నాగచైతన్య ప్రశంసలతో మూవీ లవర్స్ లో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి.
“బాలన్ – ది బాయ్” సినిమా చూసిన తర్వాత నాగచైతన్య స్పందిస్తూ – ఈ సినిమా సరికొత్త కథ, ఆశ్చర్యపరిచే కథనం, చూపు తిప్పుకోలేని చిత్రీకరణతో ఆకట్టుకుంది. ప్రతి సీన్ ఊహకు అందకుండా సాగుతూ ఆశ్చర్యపరిచింది. ఎండ్ టైటిల్స్ తర్వాత కూడా నేను అదే ఫీల్ లో ఉండిపోయాను. ఈ సినిమా ఇచ్చిన అనుభూతి నుంచి బయటకురాలేకపోయా. జితూ మాధవన్ స్క్రిప్ట్ ఇంప్రెస్ చేసింది. ఆయన “మంజుమ్మెల్ బాయ్స్”, “ఆవేశం” సినిమాల్లాగే ఈ చిత్రాన్ని కూడా తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు. అన్నారు.
గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా “బాలన్ – ది బాయ్” సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి “ఆవేశం” ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో “మంజుమ్మెల్ బాయ్స్” చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 19న హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “బాలన్ – ది బాయ్” సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
నటీనటులు – చందు సలీమ్ కుమార్, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ – వివేక్ హర్షన్
డీపీవో – షైజు ఖాలిద్
మ్యూజిక్ – సుషిన్ శ్యామ్
పీఆర్ఓ – సురేష్ ( ఎస్ కె మీడియా )
రచన – జితూ మాధవన్
నిర్మాతలు – వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్
దర్శకత్వం – చిదంబరం

