విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, ‘హిట్ మెషీన్’ అనిల్ రావిపూడి కలిసి ఒక పూర్తి స్థాయి పండుగ వినోదాత్మక చిత్రం అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రం 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది.
దిల్ రాజు, శిరీష్ స్క్రిప్ట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటికి అందజేయగా… విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టిలపై చిత్రీకరించిన మొదటి షాట్‌కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేష్ బాబు కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. దిగ్గజ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, ఎ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్ నిర్వహిస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

