HomeEntertainment‘అనకాపల్లి’ నుంచి ‘అమ్మోరు దిగినాది’ అంటూ సాగే జాతర సాంగ్ రిలీజ్

‘అనకాపల్లి’ నుంచి ‘అమ్మోరు దిగినాది’ అంటూ సాగే జాతర సాంగ్ రిలీజ్

- Advertisment -

డిఫరెంట్ కంటెంట్‌తో, రా అండ్ రస్టిక్‌గా భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కండ్రేగుల కుమార్ రాజా కో-ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా అది అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేసింది.

ఇక తాజాగా ‘అనకాపల్లి’ నుంచి జాతర సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో సంగీత స్టెప్పులు, గ్రాండియర్‌గా పాటను తెరకెక్కించిన తీరు, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, మంగ్లీ గాత్రం ఇలా అన్నీ హైలెట్‌గా నిలుస్తున్నాయి. నిజంగానే ఓ జాతర చూస్తున్నామా? అన్న రేంజ్‌లో విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇక ఈ పాటకు గణేష్ సలాది లిరిక్స్, దేవజండ్ బాణీ మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.

మాస్ ఆడియెన్స్‌కి నచ్చే యాక్షన్ సీక్వెన్స్, యూత్‌ మెచ్చే లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా రాబోతోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు.

తారాగణం : విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్
నిర్మాతలు: కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన
సహ నిర్మాత: కండ్రేగుల కుమార్ రాజా
కథ & స్క్రీన్‌ప్లే: త్రినాధరావు నక్కిన
దర్శకుడు: ఖగేష్ తమ్మినేని
DOP: మాయా. వి
సంగీతం: దేవ్ జండ్
ఎడిటర్: శ్రీకృష్ణ అట్టలూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సెట్రామరాజు మల్లెల
సంభాషణలు: ఉదయ్ భాగవతుల
ప్రొడక్షన్ డిజైనర్: రఘు కులకర్ణి
కొరియోగ్రఫీ: శేఖర్ VJ, యష్ మాస్టర్, జిత్తు మాస్టర్
కాస్ట్యూమ్ డిజైనర్: సూర్య కొయ్య
సాహిత్యం: అనంత శ్రీరామ్, కెకె, గణేష్ సలాది, రాంబాబు గోశాల, తేజ గొర్లె
అదనపు పాటలు: వి.కిరణ్ కుమార
కో-డైరెక్టర్: రమేష్ బాబు యేపాటి
సౌండ్ ఎఫెక్ట్స్: హేమంత్
DI: రెడ్ ఓచర్
రంగు: ఎం. రాజు రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: NVSS సురేష్
ప్రొడక్షన్ కంట్రోలర్: చందు దేశెట్టి
PRO: సాయి సతీష్
మార్కెటింగ్: స్టార్ సర్కిల్

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments