రాకింగ్ స్టార్ యశ్ ‘రామాయణ’లో రావణుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక రెండు భాగాల ఇతిహాస చిత్రానికి మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా ఆయన సహ నిర్మాతగా కూడా. తాజాగా ఈ సినిమా కోసం సిద్ధమవుతున్న సమయంలో తనకు ఎదురైన ఓ ఆసక్తికరమైన అనుభవాన్ని యశ్ పంచుకున్నారు. తాను రాముడి పాత్రలో కాకుండా రావణుడి పాత్రలో ఎందుకు నటిస్తున్నానో తన చిన్న కొడుకుకు వివరించాల్సి వచ్చిందని చెప్పారు. తన తండ్రి రావణుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుసుకున్న చిన్నారి మొదట ఆశ్చర్యపోయాడని… ఓ నటుడిగా ఛాలెంజ్ లాంటి ఆ పాత్రను తాను చేస్తున్నప్పటికీ… రాముడు మాత్రమే అందరికీ ఆదర్శమని వివరించి చెప్పానని యశ్ తెలిపాడు!!

