కృష్ణ కమల్ , మహి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రూరల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రముఖ దర్శకుడు దేవకట్టా సమర్పణలో కిరణ్ జయ్ కుమార్ దర్శకుడిగా రూపొందుతోంది. విజయం బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైవిధ్యమైన చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ క్రమంలో ‘జో జో’ సినిమా ఆడియెన్స్‌ను అలరించటానికి సిద్ధమైంది. సోమవారం కాషన్ 1 పేరుతో ఈ సినిమా కంటెంట్ ఏంటనే విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియో గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
రాయలసీమలోని జొన్నగిరి నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా. వర్షాలు పడినప్పుడు అక్కడ వజ్రాలు దొరుకుతాయనే వార్తలు మనం వినే ఉంటాం. ఆ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని రూరల్ లవ్ స్టోరీగా కామెడీ టచ్‌తో మేకర్స్ ‘జో జో’ సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ కాషన్ వీడియో గమనిస్తే.. మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి అనే క్యాప్షన్‌తోనే ఇది మొదలవుతుంది. వర్షం పడిన తర్వాత పొలంలో హీరో హీరోయిన్‌తో పాటు కొందరు వజ్రాలను వెతుకుతుంటారు. హీరోయిన్‌కు ఓ రాయి దొరకుతుంది. ఆమెను ప్రేమించే హీరో ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆమె అతడ్ని ఓ బూతు మాటతో నోరు మూయించేస్తుంది. ఆ మాట విని హీరోతో పాటు.. అక్కడున్న హీరో ఫ్రెండ్ కూడా షాకవుతాడు. అయితే హీరో దాన్ని కూడా మోటు సరసం అంటూ కవర్ చేయటం.. చూస్తే నవ్వు తెప్పిస్తుంది.
రా రస్టిక్ రొమాంటిక్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాషన్ వన్ వీడియోతో సినిమాపై మేకర్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని టీమ్ తెలియజేసింది.
నటీనటులు:
కృష్ణ కమల్, మహి, మకరంద్ దేశ్‌పాండే, ఫణీంద్ర దేవరపల్లి, భాష, రాజు, సతీష్ దేవట్టె, శరత్, ప్రభావతి తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ: దేవకట్టా
రచన, దర్శకత్వం: కిరణ్ జయ్ కుమార్
నిర్మాత: విజయ్ కృష్ణ లింగమనేని
నిర్మాణ సంస్థ: విజయం
మ్యూజిక్: మహేష్ శంకర్
స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కిరణ్ జయ్ కుమార్
సినిమాటోగ్రఫీ: రోహిత్ కుమార్
ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్ళపల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగి
పి.ఆర్.ఒ: నాయుడు-ఫణి(బియాండ్ మీడియా)

