ప్రముఖ కమెడియన్, నటుడు వెన్నెల కిశోర్ పుట్టినరోజు సందర్భంగా ‘గుడ్ బాయ్స్’ మేకర్స్ .. ఈ సినిమా మోషన్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. రాఘవ్ కథను అందిస్తూ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సూర్య గుణ్ణం, వివేక్ ఇనంపూడి, నవ్య శశాంక్ కనకమేడల నిర్మిస్తున్నారు. శృతి సోధి, రవి రాజా, వివా హర్ష, వామ్సీ గౌడ్, గుండు సుదర్శన్, జోషి జోష్ క్రియేషన్స్, హైపర్ ఆది, రఘుబాబు, కిరణ్ మాచా, ఢీ పండు, రమణ భార్గవ్, అశ్విని అయ్యలూరు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు!!

