ప్యారడైజ్” నుంచి ఇప్పటివరకు వచ్చిన విజువల్స్, స్టిల్స్ చూస్తుంటే… “నేచురల్ స్టార్” అన్న తన బిరుదు పట్ల నాని ఎంత అసంతృప్తిగా ఉన్నాడనేది మరింత క్లియర్ గా అర్ధమవుతోంది. మొదటి బిరుదును వదిలేసి, రెండో బిరుదు తగిలించుకోవడం మన తెలుగు చిత్రసీమలో అనాదిగా వస్తున్నదే కాబట్టి… బహుశా ఇప్పటికే ఇంకో బిరుదు (చాలా ఆన్ నేచురల్ గా ఉండేలా) ఎంపిక చేసుకునే ఉంటాడు నాని. ఒకవైపు హీరోగా తన మార్కెట్ ను అమాంతం పెంచేసుకోవాలని రేయింబవళ్లు కష్టపడుతూనే… మరోవైపు నిర్మాతగానూ తనకు తిరుగులేదని నిరూపించుకోవాలని తహతహలాడిపోతున్నాడు. సాక్షాత్తూ చిరంజీవితో ఒక సినిమా చేస్తూనే… నితిన్ తోనూ సినిమా నిర్మిస్తున్నాడు. మరో రెండుమూడు చిన్న సినిమాలు కూడా పైప్ లైన్ లో ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో “ప్యారడైజ్” ఫలితం నాని కెరీర్ కి చాలా కీలకం కానుంది!!

