సందీప్ కిషన్ క్రేజీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా డెబ్యూ చేస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్‌వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది. “సిగ్మా” అక్టోబర్ 2 న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో ఫారియా అబ్దుల్లా హీరోయిన్!

