-పద్మశ్రీ మురళీమోహన్
నటుడిగా, నిర్మాతగా, ప్రజా నాయకుడిగా సుదీర్ఘ ప్రస్థానం కొనసాగిస్తున్నారు మురళీమోహన్. ఆయన సేవలను గుర్తించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ సన్మాన కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నరెడ్కో ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొప్పుల, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ప్రముఖ బిల్డర్ డీఎస్ రావు,
సన్మాన గ్రహీత మురళీమోహన్ మాట్లాడుతూ – పద్మశ్రీ అవార్డ్ పొందిన తర్వాత ఎన్నో సత్కారాలు జరిగాయి. కానీ ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. వీళ్లంతా నా కుటుంబ సభ్యులు. పద్మశ్రీ అవార్డ్ వచ్చిన వెంటనే చాలా మంది ఫోన్ అభినందించారు. ఈ రోజు ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. శోభన్ బాబు గారు ఇచ్చిన సలహాతో నేను రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టాను.
నా తమ్ముడు కిషోర్ ప్రతి సందర్భంలో నాకు తోడుగా నిలబడ్డాడు. అప్పట్లో రియల్ ఎస్టేట్ రంగం చాలా ఇబ్బందుల్లో అస్తవ్యస్తంగా ఉండేది. అమ్మిన భూమినే మళ్లీ మళ్లీ అమ్మేవారు. అలాంటివి జరగకుండా ఒక సంస్థను స్థాపించాలని నరెడ్కో ఏర్పాటుచేశాం. మన దగ్గరకు వచ్చే కస్టమర్ ని దేవుడిలా చూడాలని భావించాం. అదే స్ఫూర్తితో ఇప్పటికీ ఈ సంస్థ కొనసాగుతుండటం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మీరు మరింతగా ఎదగాలి. రాబోయో రోజుల్లో హైదరాబాద్ దేశంలోనే నెం.1 సిటీగా మారుతుంది. అలాగే అటు అమరావతి కొత్త రాజధాని అయినా పోటాపోటీగా ఎదగాలని కోరుకుంటున్నా. అన్నారు.

