లోమేష్ పుడిపెద్ది – జయశ్రీ జంటగా ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘డ్యూ డేట్’. వరిష్ స్టూడియోస్ పతాకంపై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా ఆనంద్.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్ ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ… ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామా “డ్యూ డేట్”. ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్ చుట్టు వాణిజ్య అంశాలతో అల్లుకున్న కథ ఇది. 15 రోజుల పాటు ఏకధాటిగా జరిగే షెడ్యూల్తో తొలి షెడ్యూల్ పూర్తవుతుంది” అని అన్నారు!!

