ఆర్తి అగర్వాల్ చివరి చిత్రం ‘”ఆమె ఎవరు?” నిర్మించిన రాజమండ్రికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు కర్రి వీర గణేష్ రెండో చిత్రం ప్రారంభించనున్నారు. “రెడ్ హ్యాండ్” పేరుతో త్వరలో సెట్స్ కి వెళ్లనున్న ఈ చిత్రానికి “Every SIN has a Story” ట్యాగ్ లైన్. శ్రీ సాయిదుర్గ చిత్రాలయ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా నిర్మాణం కానున్న ఈ చిత్రాన్ని ఎన్నారై కొమ్మిడి శ్రీనివాసరెడ్డి సమర్పిస్తున్నారు. తొలి చిత్రం “చీమ – ప్రేమ మధ్యలో భామ!”తో పలు ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ టర్నడ్ డైరెక్టర్ శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు “రెడ్ హ్యాండ్” (Every SIN has a Story) చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఈ చిత్రానికి కథ – మాటలు – స్క్రీన్ ప్లే అందించడంతోపాటు నిర్మాణ సారథ్యం వహించనున్నారు. రాజమండ్రిలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది!!

