HomeEntertainment"లెనిన్" గన్ షాట్ బ్లాక్ బస్టర్ అవుతుంది : లెనిన్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో...

“లెనిన్” గన్ షాట్ బ్లాక్ బస్టర్ అవుతుంది : లెనిన్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ

- Advertisment -

‘లెనిన్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నటుడు శివాజీ సినిమా గురించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. తన సినీ ప్రయాణం అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగార్జున ఇచ్చిన అవకాశంతో ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. గత మూడు దశాబ్దాలుగా ప్రేక్షకుల ప్రేమతోనే ఈ స్థాయిలో ఉన్నానని, అందుకు నాగార్జునతో పాటు దర్శకుడు వైవీఎస్ చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.

‘లెనిన్’ తన హృదయానికి చాలా దగ్గరైన సినిమా అని చెప్పిన శివాజీ, ఈ చిత్రంలో పాత్రలు మాత్రమే కనిపిస్తాయని, ఆర్టిస్టులు కనిపించరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అఖిల్‌కు ఇది పర్ఫెక్ట్ సినిమా అని, అభిమానులు ఎలాంటి చిత్రాన్ని కోరుకుంటున్నారో అలాంటి సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని అన్నారు.

అఖిల్ విజయం కోసం నాగార్జున చేసిన కృషిని తాను దగ్గరుండి చూశానని, ఒక తండ్రి తన కుమారుడు విజయవంతం కావాలనే తపన ఎంత గొప్పదో ఈ సినిమా ద్వారా అర్థమైందన్నారు. చిన్నప్పటి నుంచి అఖిల్‌ను చూసిన తనకు, ఇప్పుడు ‘లెనిన్’గా ఆయనను చూడటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. హీరోయిన్ భాగ్యశ్రీ నటనను కూడా శివాజీ ప్రత్యేకంగా ప్రశంసించారు. తన పాత్ర ‘యతిరాజు’ గురించి ప్రస్తుతం ఎక్కువగా చెప్పనని, సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులే ఆ పాత్ర గురించి మాట్లాడుకుంటారని తెలిపారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.

‘లెనిన్’ ఒక సామాజిక మహాభారతంలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఈ సినిమా అక్కినేని కుటుంబానికి మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని శివాజీ ధీమా వ్యక్తం చేశారు. తాను గతంలో నాగార్జున గారితో, నాగేశ్వరరావు గారితో నటించిన తర్వాత ఇప్పుడు అఖిల్‌ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. చివరగా జూలై 10న విడుదల కానున్న ‘లెనిన్’ ఘన విజయం సాధిస్తుందని, “కింగ్ జూనియర్ వస్తున్నాడు” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments