HomeEntertainmentసింపుల్ అండ్ సూపర్బ్

సింపుల్ అండ్ సూపర్బ్

- Advertisment -

“మా ఇంటి బంగారం” చూశాక వచ్చిన మొదటి ఆలోచన. అంతే. చూస్తుండగా, ఇంకో ఆలోచన కూడా మెదిలింది. ఓహో… ఆహా భలే రివెంజ్ సినిమా అనికూడా.
హమ్మయ్య అనుకుంటూ, దాంతోపాటూ నవ్వుకుంటూ, థియేటర్ నుంచి బయటికి వస్తాం.
ఆడవాళ్ళకి తెగ నచ్చుతుంది.
ఆడది కులవతి, గుణవతి, సౌశీల్యవతి… మహా పద్ధతి అనే ట్యాగ్స్ కోసం పడే బాధలు,ఇప్పటికీ కొత్త కొత్త పేర్లతో చలామణి అవుతున్నాయనీ… ప్రాక్టికల్ భావజాలపు…కార్యరూపాలే చాల మందికి…అర్థ రాత్రి వంటలూ, వేకువఝాము ముగ్గులూ,తెల్లవారి పూజలూ అనే విషయాన్ని ‘హాస్యోపదేశంగా’అందించారు.”మీరేంటోళ్ళూ?” అనే
ఓ ప్రశ్న అందరినీ ఒకసారి ఉలిక్కి పడేలా చేస్తుంది.

ఓ సాధారణ అమ్మాయిని…. కుటుంబం , ఎలా ఉండాలనుకుంటుందీ, సమాజం ఏం చేయాలని చూస్తుందీ…చూపిస్తుందీ సినిమా. కానీ ఎక్కడా అతి లేదు. అసభ్యత లేదు. ఏ పాయింట్ ని ప్రూవ్ చేయడానికీ అనవషరపు హంగామా చేయలేదు.
ప్రేమంటూ ఉంటే అది లోపాలని వెతకనీయదని చాల మృదువుగా తెలిపిందంతే.
ఒక రకంగా ఇది సమంత విశ్వరూపమే.
పరిమితమైన పాత్రలైనప్పటికీ, ప్రతివారూ న్యాయం చేశారు. బామ్మ పాత్ర శ్రీలక్ష్మి గారు… తన కవితని తనే చదువుకునేటపుడు నేను భలే నవ్వేశాను
సమంత స్నేహితురాలిగా నటించిన ‘సూర్యకాంతం రీల్స్ ఫేమ్’ మంజూషా ముక్కవల్లి సహజ నటన సినిమాకి హైలైట్. ఆ అమ్మాయి అదరగొట్టేసింది.
నా ఫ్రండ్స్ కి నేను ఒక ప్రశ్న మెసేజ్ చేశాను…”నిన్ను సపోర్ట్ చేయడం కోసం నేను ఏ రిస్క్ చేయడానికీ వెనుకాడను. నీవు నాకు అలాంటి సపోర్ట్ గా ఉండగలవా?” అని. అంతలా ఆ ఆ స్నేహం మన మనసుల్ని తాకుతుంది.

చాలా కాలంగా మనం మన హీరోల ఫైట్స్ బలవంతంగా చూస్తున్నాం… ఈ సినిమాలో సమంత ఎప్పుడు ఫైట్ చేస్తుందా అని ఎదురు చూస్తాం. చాలా పవర్ వచ్చినట్లు, ఆడవాళ్ళు ఫీలవుతారు. దొంగ ఇంట్లో దూరితే, ఆడది ఎదిరించాల్సి వస్తే… వంటింట్లో ఇన్ని ఆయుధాలున్నాయన్నమాట అనిపించింది. అది మహా కిక్కులే.
గతంలోని బంధాలూ, బాధలూ, గాధలూ గాయాలూ మనుషులకు జీవిత పాఠాలే. అలానే భావిస్తే మనసుని కపటం, స్వార్థం, అసూయ లేకుండా నిర్మలంగా ఉంచగలిగితే… సింపుల్ గా అంతఃకరణ శుద్ధి ఉంటే….అవేవీ అంటని, చక్కని జీవితం దక్కుతుంది.
బూటకపు రాజకీయ నాయకులూ, బూటకపు బ్యూరోక్రాట్లూ లాగే బూటకపు ఉద్యమకారులు ఎలా యువతని నాశనం చేస్తారో… ఓ చేతావని.
ఇక విలను వీకనీ, హాస్యం బోరనీ, పాటలు నాట్ సో గ్రేటనీ కొందరు విశ్లేషకుల భావన.
అయినా నవ్వుకుంటాం. ఇప్పుడెలా అని ఉత్కంఠతో ఎదురుచూస్తాం. స్నేహమెంత మధురం అని ఉద్వేగ పడతాం. ఆడాళ్ళా… మజాకా అని ఉత్సాహ పడతాం. సమంత స్వంత రివెంజ్ ఒకింత ఉందిలే అని సంతోషిస్తాం. మొత్తానికి హాయిగా థియేటర్ బయటికొస్తాం.చూడండి. మంచి సినిమా ఇది.
నేను సినిమా విశ్లేషకురాలిని కాదు. సగటు ప్రేక్షకురాలిని!!

-జయశ్రీ పావని

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments