తిరువీర్ – ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ..! సుకుమారి’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ కామెడీ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘శివం భజే’ చిత్రాన్ని నిర్మించిన గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి దీనిని నిర్మిస్తున్నారు.
తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఓ..! సుకుమారి’ టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. భరత్ మంచిరాజు స్వరపరిచిన ట్యూన్ కి అభిజిత్ రావు సోల్ ఫుల్ వోకల్స్, పూర్ణాచారి సాహిత్యం అందించారు!!

