Friday, December 5, 2025
HomeEntertainmentఇకపై బుద్ధిగా అల్లరి చేస్తానంటున్న నరేష్

ఇకపై బుద్ధిగా అల్లరి చేస్తానంటున్న నరేష్

- Advertisment -

అల్లరి నరేష్ తిరిగి కామెడీ జానర్ లోకి వచ్చారు. చంద్ర మోహన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ – బ్యానర్స్ పై రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫాంటసీ, కామెడీ బ్లెండ్ తో రిఫ్రెషింగ్ గా ఉండబోతోందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా వేడుకతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. నాగ చైతన్య ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. స్టార్ డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు వశిష్ట, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. సుప్రియ యార్లగడ్డ, అనిల్ సుంకర, జెమిని కిరణ్ తదితరులు హాజరయ్యారు. వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో చేసున్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments