HomeEventsకంటెంట్ నచ్చితేఏ క్యారెక్టరైనా చేస్తా!!

కంటెంట్ నచ్చితేఏ క్యారెక్టరైనా చేస్తా!!

- Advertisment -

డా. రాజశేఖర్‌

యాంగ్రీ హీరో డా.రాజశేఖర్‌ను ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సత్కరించింది. డా.రాజశేఖర్‌ కమ్‌ బ్యాక్‌ మూవీ “బైకర్‌” సినిమాలో ఆయన నటించిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఆయనకు క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గౌరవఅధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు జె.వి. బత్తుల ప్రసాద్‌రావు, సెక్రటరీ సురేష్‌కొండేటి తదితరులు బొకేను అందజేశారు. అనంతరం క్రిటిక్స్‌ ట్రెజరర్‌ భరద్వాజ సన్మాన పత్రాన్ని ఆయనకు చదివి వినిపించి, ఆయనకు అందజేయడం జరిగింది.

సీనియర్‌ జర్నలిస్ట్‌, క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ… రాజశేఖర్‌ నటన గురించి మనం ప్రత్యేకించి మాట్లాడక్కర్లేదు. అంకుశం ఆగ్రహం వంటి చిత్రాల్లో ఆయనది గ్రేట్‌ పెర్ఫార్మెన్స్‌. మనతో ఆయన అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన వెంకటేశ్వరావుగారు ఎప్పుడూ మాట్లడని వారు ఆమన కూడా మాట్లాడారు అంటేనే చెప్పవచ్చు ఆయన మీడియాతో ఎంత చక్కగా ఉంటారో. సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో ఆయన స్పిరిట్‌గాని ఆయన ఉత్సాహం మరింత రెట్టింపుగా ఉండాలి. ఫిలిం క్రిటిక్స్‌ చేస్తున్నారంటే దానికి ఒక గొప్పతనం ఏర్పడుతుంది. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావుగారు ఒకానొక సమయంలో ఫిలిం క్రిటిక్స్ చేసిన సన్మానం అనేది ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అన్నారు. రాజశేఖర్‌గారి సహాయ సహకారాలు ఎప్పటికీ మన అందరికీ ఉంటాయి” అని అన్నారు.

జీవితరాజశేఖర్‌ మాట్లాడుతూ… “మనమందరం ఒక ఫ్యామిలీలాంటి వాళ్ళం. మీడియాతో మాకు ఎప్పుడూ బావుంటది. మమ్మల్ని మీరు ఎప్పుడూ కించపరచలేదు. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా ఎక్కువయిపోయి వాటిల్లో వచ్చే కొన్ని వార్తల వల్ల అసలు మీడియా ఏంటి జర్నలిజం ఏంటి అని కొంత కన్‌ఫ్యూజన్‌కి గురయ్యాను. రాజశేఖర్‌గారికి ఎన్నో అవకాశాలు వచ్చినా తను ఇన్‌స్పైర్‌ అయ్యే పాత్రలు రాక చేయడం లేదు. అదే విషయాన్ని ఆయన “బైకర్‌” ప్రమోషన్స్‌ సమయంలో చెబితే. దానికి… “రాజశేఖర్‌గారు క్యారెక్టర్స్‌ అడుగుతున్నారు” అన్నారు. ఆఫర్స్ అనేకం వస్తున్నాయి. నచ్చిన పాత్రలు రావడంలేదు అన్నారు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మొత్తం ఫ్యామిలీని కలిసినట్లు అనిపించింది” అని అన్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ బాలరెడ్డి మాట్లాడుతూ… డా.రాజశేఖర్‌ చాలా విలక్షణమైన కథానాయకుడు. ఆయన నటించిన అంకుశం, తలంబ్రాలు చాలా అద్భుతమైన సినిమాలు. ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సంచలనాలు సృష్టించాయి. క్రిటిక్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కి వచ్చిన మొట్ట మొదటి హీరో డా. రాజశేఖర్‌ అని అన్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ మోహన్‌ గోటేటి మాట్లాడుతూ.. ఎన్ని హిట్లు వచ్చినా సరే ఆయన ఎప్పటిలానే ఉంటారు. కాస్త కూడా గర్వం ఉండదు. ఎప్పుడూ అందరితో కలిసి ఎంతో సరదాగా ఒక ఫ్యామిలీలాగా ఉంటారు. అంకుశం లాంటి సినిమా ఆయన కెరియర్‌లో ఎంత పెద్ద హిట్‌ ఇచ్చినప్పటికీ ఆయన బిహేవియర్‌లో కొంచం కూడా తేడా లేదు. అప్పట్లో రాఘవేంద్రరావు అల్లరి ప్రియుడు అని రాజశేఖర్‌ని తీసుకువాచ్చారేంటి…. ఈయన యాక్షన్‌ హీరో కదా అంటే మీరు అలాగే రాసుకోండి. యాక్షన్‌ హీరోని అల్లరి ప్రియుడులా రాఘవేంద్రరావు ఎలా చూపిస్తాడు అని మీరు రాసుకోండి అన్నారు. అలా ఏ పాత్రనైనా ఆయన చాలా అద్భుతంగా చేయగలరు. కల్లాకపటం లేని మనిషి. ఎక్కడ ఏమి మాట్లాడాలో కూడా తెలియని మనిషి. జీవితగారు ఉండబట్టి అన్నీ కవర్‌ చేసుకుంటూ వస్తున్నారు. బైకర్‌ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు. ఇక ముందు కూడా మరిన్ని సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి” అన్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ ట్రేడ్‌గైడ్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… రాజశేఖర్‌గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ రోజు పిలవగానే వచ్చి మాకు సహకరించినందుకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

క్రిటిక్స్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జనార్ధన్‌ మాట్లాడుతూ.. రాజశేఖర్‌గారు నటించిన అన్ని చిత్రాలు నేను కవర్‌ చేశాను” అంటూ పాత విషయాలను గుర్తు చేసుకున్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ గిరిధర్‌ మాట్లాడుతూ… రాజశేఖర్‌గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. నేను కొన్ని రోజులు ఆయనకు పీఆర్‌ఓగా చేశాను. ఆయనది చాలా ప్లెయిన్‌ హార్ట్‌. నేను స్టార్ట్ చేసిన”మా ఫ్యామిలీ డాక్టర్‌” మ్యాగజైన్‌కు గౌరవ సంపాదకులుగా ఉన్నారు. ఏదో ఆయన పేరు ఉంటే నా మ్యాగజైన్‌కి క్రేజ్‌ వస్తుందనుకుంటే.. ఆయన మాత్రం దానికి సంబంధించి నాకు ఎన్నో పుస్తకాలను అందజేశారు. అంత డెడికేషన్‌ ఉన్న వ్యక్తి రాజశేఖర్‌గారు. ఆయన నటించిన అల్లరిప్రియుడు చిత్రానికి నేను పీఆర్‌ఓగా చేశాను” అన్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ ఆర్‌డిఎస్‌ప్రకాశ్‌ మాట్లాడుతూ… శివయ్య సినిమా టైమలో బి.ఎ. రాజుగారు ఇంటర్వ్యూ తీసుకోమన్నారు. అప్పుడు రాజశేఖర్‌గారు ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ ఆయన నాకు సమయాన్ని కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చారు. సడెన్‌గా ఆయన చెన్నై వెళుతుంటే… ఎయిర్‌పోర్ట్‌ కి వెళ్ళేవరకు కారులో ఇంటర్వ్యూ తీసుకోమన్నారు. అంతేకాక ఆయన ఎంతో గ్రేట్‌ పెర్ఫార్మర్‌. ఆయన మా డాక్టర్‌ కూడా మా నాన్నగారికి మా అబ్బాయికి మంచి మెడిసిన్‌ ఇచ్చారు” అన్నారు.

హీరో రాజశేఖర్‌ మాట్లాడుతూ… ఏప్రిల్‌ 3 బైకర్‌ సినిమా రిలీజయింది. అప్పటి నుంచి నా పాత్రకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది ఎంతో మంది ఫోన్లు చేసి మెచ్చుకున్నారు. కానీ నా మనసులో ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అంటే నాకు ప్రత్యేక గౌనవం ఉంది. వేరే అవార్డులతో పోల్చితే ఇదే నాకు చాలా పెద్ద అవార్డు. అంకుశం ముందు నాకు యాక్సిడెంట్‌ అయింది. అంకుశం పెద్ద హిట్‌ అయింది. ఆ తరువాత వచ్చిన మగాడు సినిమా కూడా పెద్ద హిట్‌ అయింది. అదే విధంగా ఇటీవలె మళ్లీ నాకు యాక్సిడెంట్‌ అయింది. బైకర్‌ మంచి హిట్‌ అయింది. ఆ తరువాత వస్తున్న సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను. ఇప్పుడిప్పుడే కాస్త బెటర్‌గా ఫీలవుతున్నాను. బైకర్‌ హిట్‌ మాత్రం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఎందుకంటే సక్సెస్‌ చూసి చాలా రోజులు అవడంతో నాకు అలా అనిపిస్తుందేమో నాకు తెలియదు. ఏది ఏమైనప్పటపికీ నేను థియేటర్‌ నుంచి బయటకు రాగానే మీరు ఇంకా సినిమాలు చేయాలి అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంకా కంటిన్యూస్‌గా రావాలి. మంచి సినిమాలు చేస్తుండాలి అని ప్రేక్షకులు అంటుంటే చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

క్రిటిక్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ సురేష్‌ కొండేటి మాట్లాడుతూ… ముందుగా జీవితగారికి చాలా థ్యాంక్స్‌. ఈ కార్యక్రమానికి ఇంత అద్భుతంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు.

ప్రశ్నలు- జవాబులు

బుల్లెట్‌ సునీల్‌ తో కంబ్యాక్‌ ఎలా అనిపించింది?

బైకర్‌ మంచి సినిమా అని చేశాను. ఆ కష్టం ఫలించింది. ఇది ఇలా ఉండాలి ఇలానే ఉండాలి అని నేనేమి ఊహించుకుని చేయలేదు.

ఇక ముందు మీరు సెలెక్ట్‌ చేసుకునే పాత్రలు ఎలా ఉంటాయి?

ఇప్పటి వరకు అప్రోచ్‌ అయిన వాళ్ళు స్టోరీ చెప్పలేదు. పవన్‌స శాస్ధినేని డైరెక్టన్‌లో ఒక సినిమా చేస్తున్నా. ఇంకా టైలిల్‌ అనుకోలేదు. ఐ.వి.శశిగారి అబ్బాయితో కూడా చేస్తున్నాను. శశి గారు నాతో “మావారు మంచివారు” సినిమా తీశారు. దానికి కూడాఇంకా టైటిల్‌ అనుకోలేదు.

మీరు ఒక విలన్‌గా రీ ఎంట్రీ ఇస్తారని అనుకున్నాం.. కానీ సాఫ్ట్‌ క్యారెక్టర్‌ చేశారు?

భవిష్యత్తులో విలన్‌గా వస్తే చేస్తాను. కొన్ని క్యారెక్టర్స్‌ చేయడం ఈజీ.. హీరోగా చేయాలంటేనే చాల కష్టం. ఎందుకంటే దానికి గ్లామర్ మెయింటైన్ చేయాలి. మన ఎక్స్‌ప్రెషన్స్‌ బాగా పలకాలి. విలన్‌ అంటే నో ప్రాబ్లమ్‌ ఎలా ఉన్నా పర్వాలేదు. సబ్జెక్ట్‌ బావుంటే పెద్ద హీరోతోనైనా.. చిన్న హీరో సినిమాలోనైనా చేస్తాను.

బైకర్‌ చేస్తున్నప్పుడు పాత జ్ఞాపకాలు ఏమన్నా గుర్తుకు వచ్చాయా?

నేను బైక్ జర్నీ ఎప్పుడూ ముగ్గురుతోనే ఉండేది. మా ఫాదర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌రగా చేశారు. బైక్‌ మీద బయటకు వెళితే ఫ్రెండ్స్‌తో కూడా ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం. ఒకసారి పోలీసులు పట్టుకున్నారు. సారీ చెప్పి వచ్చాం.

బైకర్‌లో హీరో శర్వాకి తండ్రిగా చేశారు. మరే హీరోకైనా తండ్రిగా చేయాలంటే చేస్తారా?

క్యారెక్టర్‌ బావుంటే ఎవరికైనా చేస్తాను. బేసిగ్గా నా నుంచి యాక్షన్‌ కోరుకుంటారు.

అల్లరి ప్రియుడు సీక్వెల్‌ చేస్తారా?

మీరుచూస్తానంటే తప్పకుండా చేస్తాను. (పెద్దగా నవ్వుతూ)

జీవితగారిని బైక్‌ మీద కూర్చోబెట్టి వెళ్ళిన రోజులు గుర్తుకువచ్చాయా?

నీలకంఠంగారు ఒక డొక్కు అబంబాసిడర్‌ ఇచ్చి చెన్నై ఫ్లైట్‌కి ఒకసారి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళమంటే నేను బుల్లెట్‌లో జీవితను ఎక్కించుకుని వెళ్ళాను.

జీవితగారు కాకుండా బ్యాక్‌ సీట్‌లో ఎవరన్నా ఎక్కిన సందర్భాలు ఉన్నాయా?

పెళ్ళికి ముందు ఒక నీగ్రో అమ్మాయితో సినిమాకి వెళ్ళాం. టికెట్‌ దొరకలేదు. ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకుని బండి మీద ఒక రౌండ్‌ వేశాను. ఆ అమ్మాయి పేరు గ్లోరియా.

మీ సినిమాలు రీరిలీజ్‌ చేస్తారా ఏ చిత్రాలయితే బావుంటాయి?

డిస్ట్రిబ్యూటర్లు చెపుతారు. ఏవి ఆడతాయో. అల్లరిప్రియుడు అయితే బావుంటుంది. ఎంటర్‌టైన్మెంట్‌ ఉంటుంది.

మీ ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చేసే ఆలోచన ఏదైనా ఉందా?

అవును చేయాలనుకుంటున్నాం. ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్‌ మంచి కథతో వస్తామని చెప్పారు.

ప్రొఫిషనల్‌గా డబ్బుకోసం చేసేవి కొన్నుంటాయి. పేరు కోసం చేసేవి కొన్నుంటాయి. మీరు ఎలాంటి చిత్రాలు చేయాలనుకుంటున్నారు?

బైకర్‌లాగా రెండూ కలిసి వస్తే బావుంటాయి. మంచి పాత్ర… మంచి పారితోషికం రెండూ ఉండాలని కోరుకుంటున్నాను.

జీవిత నటించడానికి ఎందుకు ఒప్పుకోరు?
జీవిత లేకపోతే నా జీవితం లేదు. తను ఎక్కడికన్నా వెళితే చాలా కష్టం.. పిల్లలకు నాకు తను ఎప్పుడూ ఉండాలి. రాజకీయాల్లోకి వెళితే ఇంకా కష్టం. ఫ్యామిలీకి తను దగ్గరగా ఉండాలి.

చీరంజీవి సినిమాలో విలన్ ఆఫర్ వస్తే చేస్తారా?

చేస్తాను తప్పకుండా. నాకు అదేమీ లేదు.

మీరు ఎన్నో దానధర్మాలు చేశారు. ఇప్పుడు అవే మీ కుటుంబాన్ని కాపాడుతోందని అనుకోవచ్చా??

నువ్వు చేసే ధర్మమే నిన్ను కాపాడుతుంది అని కచ్ఛితంగా నేను నమ్ముతాను.

ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారు?

పాలిటిక్స్‌ అనేది చాలా పెద్ద పని. చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. సినిమాలు పాలిటిక్స్‌ రెండూ చేయాలంటే కష్టం. అందుకే వద్దు అనుటకున్నాను. నా ఇష్టంతోనే జీవితని పాలిటిక్స్‌కి తీసుకెళ్ళా నాకు మాట్లాడటం రాదు కాబట్టి జీవిత బాగా మాట్లాడుతుందని ఆమెని తీసుకెళ్ళేవాడిని.

విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీపై మీ అభిప్రాయం?

విజయ్‌గారు రాజకీయాల్లోకి రావడం మంచిదే. ఇంత మంచి రెస్పాన్స్‌ రావడం అనేది చాలా గ్రేట్‌. అప్పట్లో ఎమ్‌జేఆర్‌ తరువాత ఆయనకే ప్రజల నుంచి అంత రెస్పాన్స్‌ వచ్చింది.

మీరు చూసిన సబంధాలే మీ పిల్లలు చేసుకుంటారా?

ప్రస్తుతానికి ఆలాగే ఉన్నారు. శివాని శివాత్మికకి సంబంధాలు వస్తున్నాయి. కానీ పిల్లలు అప్పుడే చేసుకోము అంటున్నారు. కొన్నిరోజులు ఇంకా మేము యాక్టింగ్‌ చేయాలి అంటున్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments