హీరో విజయ్ దేవరకొండ 10 ఏళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్నారు. ఆయన సోలో హీరోగా నటించిన తొలి సినిమా “పెళ్లి చూపులు” 2016లో రిలీజైంది. అప్పటికే “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాలో నటించి పేరు తెచ్చుకున్న విజయ్.. “పెళ్లి చూపులు” సినిమాతో సోలో హీరోగా అరంగేట్రం చేశారు. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల ప్రేమాభిమానాలు సంపాదించుకుని, బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కొట్టారు విజయ్. ఈ సినిమా విజయంతో ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. “టాక్సీవాలా, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ఫ్యామిలీ స్టార్, ఖుషి, కింగ్డమ్” ఇలా.. వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు విజయ్ దేవరకొండ. ప్రభాస్ “కల్కి” సినిమాలో అర్జునుడి పాత్రలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్న సినిమాతో కెరీర్ మొదలుపెట్టి పెద్ద స్టార్ గా ఎదిగిన విజయ్ ప్రస్థానం ఎంతోమంది కొత్త వాళ్లకు ఇన్సిపిరేషన్ గా నిలుస్తోంది.
ఈ దశాబ్దకాలంలో జయాపజయాలు, ఎత్తుపల్లాలు, ప్రేమ, ద్వేషం ఎదుర్కొన్నారు విజయ్. మరే హీరో చూడనంత వెర్సటైల్ కెరీర్ చూశారు. రౌడీ వేర్ బ్రాండ్ తో ఒక వ్యాపారవేత్తగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూనే, ది దేవరకొండ ఫౌండేషన్ తో పేద మధ్య తరగతి వారికి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతిభ గల 180 మంది పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించారు!!

