HomeEntertainmentరాకీ భాయ్ ని ఇకరావణుడే రక్షించాలి

రాకీ భాయ్ ని ఇకరావణుడే రక్షించాలి

- Advertisment -

టాక్సిక్” తొలిరోజు వసూళ్లు యశ్ స్టార్దమ్ కి అర్థం పడితే… కథలో దమ్ము లేకపోతే ఎంతటి స్టార్డమ్ సైతం అక్కరకు రాదని మలి రోజు వసూళ్లు అందరికీ అర్థమయ్యేలా చేశాయి. “బాహుబలి” 1, 2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన “సాహో” చిత్రాన్ని తలపిస్తోంది “టాక్సిక్”. “టాక్సిక్”తో పోల్చితే “సాహో”చాలా బెటర్ మూవీ అయినప్పటికీ… ఆ చిత్రం కూడా ప్రభాస్ ఇమేజ్ ని క్యాష్ చేసుకొని ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ… 200 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించింది. ఇప్పుడు “టాక్సిక్” కూడా అదే బాటలో పయనిస్తోంది. “టాక్సిక్” హిందీ వెర్షన్ ఇంకా పూర్తిగా చతికిల పడలేదు. మూడో రోజు కూడా సుమారు 20 కోట్లు రాబట్టింది. సినిమా బాగుండి ఉంటే “దురంధర్-2” రికార్డ్స్ తునాతునకలై ఉండేవి. ఇక ఇప్పుడు రాకీ బాయ్ ని రక్షించాల్సింది నవంబర్ 6 న రానున్న రామాయణంలోని “రావణుడు” మాత్రమే. దీనికి సీక్వెల్ కూడా సంవత్సరం వ్యవధిలో రానుంది. కాబట్టి… యశ్ కెరీర్ కి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే తనలో ఓ బీభత్సమైన “రైటర్” ఉన్నాడనే భ్రమలోంచి యశ్ తక్షణం బయటపడాలి. అవసరమైతే సదరు రైటర్ జీవితంలో మళ్లీ ఎప్పుడూ బయటకు తొంగి చూసే అవకాశం కూడా ఇవ్వకుండా… నిర్దాక్షిణ్యంగా “ఇనుప గొలుసులతో” కట్టేసి శాశ్వతంగా బంధించాలి. అలా చేయడమే రాకీ బాయ్ కెరీర్ కి శ్రీరామరక్ష. “కో రైటర్, కో ప్రొడ్యూసర్” పాత్రల జోలికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!!

-ధీరజ అప్పాజీ

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments