శ్రీమతి కె. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘తెల్ల కాగితం’. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందిస్తున్నారు. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘తెలుసా తెలుసా’ అంటూ సాగే ఓ మెలోడీ గీతాన్ని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. సురేష్ బనిశెట్టి సాహిత్యం.. అనుదీప్ దేవ్, లిప్సిక గాత్రం అందించిన ఈ గీతానికి విజయ్ బుల్గానిన్ స్వర సారథ్యం చేశారు!!

