HomeEntertainmentవసుదేవసుతం యూనివర్సల్ కాన్సెప్ట్: వర్సటైల్ డైరెక్టర్ వైకుంఠ బోను

వసుదేవసుతం యూనివర్సల్ కాన్సెప్ట్: వర్సటైల్ డైరెక్టర్ వైకుంఠ బోను

- Advertisment -

సినిమా సినిమాకు తన స్టామినాను పెంచు కుంటూ ముందుకు సాగుతున్న టాలెంటెడ్ డైరెక్టర్ వైకుంఠ బోను. జాజిమల్లి సినిమాతో స్టార్ట్ అయిన ఆయన సినీ ప్రస్థానం నిరంతరంగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ సాగుతూనే ఉంది. ఆ క్రమంలోనే ఆయన దర్శకత్వం వహించిన’ వసుదేవసుతం’ తాజాగా ఓ టీ టి లో హల్చల్ చేస్తుంది .ఈ సందర్భంగా ఆయన మీడియా తో ముచ్చటించారు.
రెయిన్ బో సినిమాస్ పదాకంపై ధనలక్ష్మి బాదర్ల నిర్మాతగా, వసుదేవసుతానికి నేను దర్శకత్వం వహించాను. ఇది నా ఫోర్టు మూవీ. వసుదేవసుతం కాన్సెప్ట్ ఏమిటంటే వసుదేవుని కొడుకు శ్రీకృష్ణుడు కలియుగ రూపమైన పూరి జగన్నాధుని దేవాలయం నేపధ్యంలో తన సోదరి కోసం మహాభారతంలో శ్ ఏం చేశాడు. అదే సోదరి కోసం ఇప్పుడు మా సినిమాలో హీరో కిషన్ ఏం చేశాడనేదే ఈ చిత్ర కథాంశం.మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా కంప్లీట్ టోటల్ ఫ్యామిలీ ప్యాక్ మూవీ ఇది.పూరి జగన్నాధుని లో ఉన్న బ్రహ్మ పదార్థం గురించి విలన్స్ ఏం చేశారు, హీరో వాళ్ళను ఎలా నిలువరించారు. అందులోకి నరసింహస్వామి గరుత్మంతుడు వాసుకి ఎలా వచ్చారు అనేది మా సినిమా గుర్తు చేస్తుంది.
ముఖ్యంగా మణిశర్మ గారి సాంగ్స్, ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.. అలాగే మా హీరో మాస్టర్ మహేంద్రన్ అద్భుతంగా నటించారు. నాకీ అవకాశం ఇచ్చిన మా నిర్మాత ధనలక్ష్మి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

వసుదేవసుతం జులై 10th న ధియేటర్లో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. మంచి టాక్ తో రన్ అయింది. ప్రస్తుతం ఆహా గోల్డ్ లో స్ట్రీమింగ్ అవుతుంది
అలాగే ఈ నంబర్ నుండి వసుదేవసుతం సినిమాకు ప్రీక్వెల్ స్టార్ట్ చేస్తున్నాను. ప్రముఖ స్టార్ హీరోయిన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. . అలాగే మరో క్యూట్ లవ్ స్టోరీని కూడా డైరెక్ట్ చేయబోతున్నాను అని అన్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments