HomeEntertainmentమంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో బిగ్ బడ్జెట్ డివైన్ యాక్షన్ థ్రిల్లర్

మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో బిగ్ బడ్జెట్ డివైన్ యాక్షన్ థ్రిల్లర్

- Advertisment -

పోతరాజు నేపథ్యంలో తెరకెక్కనున్న RPA క్రియేషన్స్ ప్రొడక్షన్ నం. 4

‘ప్రేమకథా చిత్రం’, ‘జక్కన్న’ చిత్రాల నిర్మాతల నుంచి మరో ప్రతిష్టాత్మక చిత్రం

విభిన్నమైన కథలు, పవర్‌ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో మంచు మనోజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పోతరాజు నేపథ్యంలో రూపొందనున్న ఈ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని ‘డివైన్ యాక్షన్ థ్రిల్లర్’గా తెరకెక్కిస్తున్నారు. RPA క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ఆ సంస్థకు ప్రొడక్షన్ నం. 4.

‘ప్రేమకథా చిత్రం’, ‘జక్కన్న’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన R. P. Akshith Reddy, R. Sudarshan Reddy ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద కో-డైరెక్టర్‌గా పనిచేసిన ఏ. శ్రీధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు ఈ సినిమా కోసం అత్యంత శక్తివంతమైన కథను సిద్ధం చేశారు. ఇప్పటివరకు మంచు మనోజ్‌ను చూడని సరికొత్త అవతార్‌లో ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

పోతరాజు నేపథ్యంలో దైవిక అంశాలు, ఉత్కంఠభరితమైన కథనం, భారీ యాక్షన్ సన్నివేశాల సమ్మేళనంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలంగాణ పండుగల వైభవం, సంప్రదాయాల నేపథ్యంతో రూపొందనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనుంది.

ఈ చిత్రానికి ఎం. శ్రీకాంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఆర్. ఆయుష్ రెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ తదితర వివరాలను చిత్రబృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.

చిత్ర వివరాలు

చిత్రం: RPA క్రియేషన్స్ ప్రొడక్షన్ నం. 4
జానర్: బిగ్ బడ్జెట్ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
నటీనటుడు: మంచు మనోజ్
దర్శకుడు: ఏ. శ్రీధర్
బ్యానర్: RPA క్రియేషన్స్
నిర్మాతలు: ఆర్.పి. అక్షిత్ రెడ్డి, ఆర్. సుదర్శన్ రెడ్డి
కో-ప్రొడ్యూసర్: ఆర్. ఆయుష్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం. శ్రీకాంత్ రెడ్డి
పీఆర్వో: తేజస్వి సజ్జా

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments