HomeEntertainmentకట్టిపడేసే కథ-కథనాలతో అగ్లీ స్టోరీ

కట్టిపడేసే కథ-కథనాలతో అగ్లీ స్టోరీ

- Advertisment -

ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘భీమ్లా నాయక్’ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతుల మీదుగా ట్రైలర్ విడుదల అయ్యింది. నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఇంటెన్స్ నెరేషన్, బలమైన ఎమోషన్స్, ఊహించని ట్విస్టులతో నిండిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్ స్కోర్ ట్రైలర్‌ను మరింత ఆకర్షణీయం చేసింది. ఉత్కంఠ, ఆందోళన, ఆకర్షణ మూడింటినీ సమానంగా కలిపి రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా విజయాన్ని ముందే సూచిస్తోంది. రియా జియా ప్రొడక్షన్ వాల్యూస్ కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నాయి. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో మూవీ టీం సినిమా ఔట్ పుట్ పై సంతోషం వ్యక్తం చేసింది. సినిమా పట్ల తమ నమ్మకాన్ని తెలియజేసింది. ఈనెల 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది!!

డైరెక్టర్ ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ… “ప్రతి ప్రేమకు ఓ చీకటి కోణం ఉంటుంది. ఆ సత్యాన్ని బలంగా చెప్పడమే మా లక్ష్యం. నందు, అవికా నటన ఈ చిత్రానికి బలం చేకూర్చింది. మా ప్రొడ్యూసర్లు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారు ఈ సినిమా క్వాలిటీ విషయంలో నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. కచ్చితంగా ఈ సినిమా చూసి, ప్రేక్షకులు థియేటర్లలో మంచి అనుభవం పొందుతారు” అని తెలిపారు. అలాగే ట్రైలర్ లాంచ్ చేసిన సాగర్ కె చంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments