HomeEntertainmentఒక పెను విషాదం

ఒక పెను విషాదం

- Advertisment -

యశ్ నాలుగేళ్ల కష్టం
దిల్ రాజు నాలుగైదేళ్ల కష్టార్జితం
ఒక్క రోజులో కృష్ణార్పణం

బాక్డాఫీసు బ్రహ్మాండం బద్దలు చేస్తుందనే భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన “టాక్సిక్”… ఇటీవల కాలంలో ఏ చిత్రానికీ రానన్ని బ్యాడ్ రివ్యూస్ మూటగట్టుకుంది. “టార్చర్” అని కొందరు అంటుంటే “నైట్ మేర్” అని కొందరు అంటున్నారు. కే జి ఎఫ్ చిత్రాల తర్వాత “టాక్సిక్” కోసం నాలుగేళ్లు కేటాయించిన యశ్ ను చూసి అందరూ జాలి పడుతున్నారు. అలాగే ఈ చిత్రం తెలుగు హక్కుల కోసం 60 కోట్లు పైగా వెచ్చించిన దిల్ రాజును చూసి కూడా.

అయితే యశ్ విషయానికొస్తే… తను ఈ సినిమాకి హీరో మాత్రమే కాదు. కో- రైటర్ కమ్ కో- ప్రొడ్యూసర్. అంటే కథలో కాళ్లు – వేళ్ళు పెట్టాడు. చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు. బహుశా తన పారితోషికంలో కొంత భాగాన్ని “పార్ట్ నర్ షిప్”గా చేసుకుని ఉండొచ్చు.. కాబట్టి తప్పు మొత్తం చిత్ర దర్శకురాలు గీతా మోహన్ దాస్ పై నెట్టేయడం సబబు కాకపోవచ్చు.

ఇకపోతే ఈ చిత్రాన్ని నిర్మించిన కేవిఎన్ ప్రొడక్షన్స్ “టాక్సిక్”కి ముందు విజయ్ తో “జననాయకన్” నిర్మించింది. ఆ చిత్రం ఫలితం అందరికీ తెలిసిందే. ఇదే సంస్థ ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ – సైఫ్ అలీ ఖాన్ లతో “హైవాన్” అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగులో మన మెగాస్టార్ తో “కాక” తెరకెక్కిస్తోంది. ఈ రెండు భారీ చిత్రాలతోపాటు కన్నడలోనూ మరో చిత్రం నిర్మిస్తోంది.

తనతో “జననాయకన్” తీసి నష్టపోయినందుకు గాను ఈ సంస్థ అధినేత కే వెంకట్ నారాయణను ఢిల్లీలో “తమిళనాడు అధికార ప్రతినిధి”గా నియమించింది విజయ్ ప్రభుత్వం. దీనిపై తీవ్ర స్థాయిలో వెల్లువెత్తాయి. తన వ్యాపారాలు పర్యవేక్షించుకుంటూ… తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధిగా అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తూ… ఇన్ని భాషల్లో ఏకకాలంలో ఎడం చేత్తో ఎడా పెడా సినిమాలు తీసేయగలుగుతుండడం ఎలా సాధ్యం అన్నది ఒక “కేస్ స్టడీ”గా తీసుకుని అధ్యయనం చేయాలి. కొంతమంది అంతే… సినిమాలు తీయడానికి డబ్బులు పెడితే (పడేస్తే) చాలనుకుంటారు.

చిత్ర నిర్మాణంలో కార్పొరేట్ తరహా పోకడలు ఎంతమాత్రం పనిచేయవని ఎన్నోసార్లు నిరూపితమైంది. అమితాబచ్చన్, అనిల్ అంబాని, రామ్ గోపాల్ వర్మ, కరణ్ జోహార్ వంటి వారు ఘోరంగా చేతులు కాల్చుకొని ఉండడం అందరికీ తెలిసిందే. అయినా సరే “బ్యాంకులో డబ్బులు మూలుగుతున్నాయి కదా” అన్నట్లుగా ఎడాపెడా సినిమాలు తీయడం ఎంత ప్రమాదకరమో “జననాయకుడు, టాక్సిక్” చిత్రాలు తాజాగా చెబుతున్నాయి. దురదృష్టవశాత్తు ఈ రెండు సినిమాలకు తెలుగులో దిల్ రాజు బాధితుడు కావడం విచారించదగ్గ విషయం. ఇటీవలకాలంలో సక్సెస్ ల పరంగా వెనకబడి ఉన్న దిల్ రాజుకు ఈ రెండు చిత్రాలు పుండు మీద కారం చల్లినట్లయ్యింది!!

-ధీరజ అప్పాజీ

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments