HomeEntertainmentకనీ వినీ ఎరుగని రీతిలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్

కనీ వినీ ఎరుగని రీతిలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్

- Advertisment -

తారాస్థాయికి టాలీవుడ్ లో సంబరాలు

సంక్రాంతి తర్వాత దాదాపు ఆరు నెలలు సరైన విజయం కోసం టాలీవుడ్ అల్లాడిపోయింది. ఒకటి రెండు కంటి తుడుపు విజయాలు జోష్ నింపలేకపోయాయి. “పెద్ది” పరిస్థితి కూడా అంతేనేమో అనుకున్నారు. కానీ మెల్లగా… చావు తప్పి కన్ను లొట్టబోయిన చందాన “హిట్” అనిపించుకుంది. “రామ్ చరణ్ పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలం” అనే తీర్మానాలు వెలువడ్డాయి. పండగ తర్వాత నుంచి సరైన సినిమా ఏదీ పడకపోవడం కలిసొచ్చిందని కూడా అన్నారు. మొత్తానికి తొలి చిత్రంతో “ఉప్పెన” సృష్టించిన సానా బుచ్చిబాబు “సెకండ్ సినిమా సిండ్రోమ్” అనే ద్వితీయ విఘ్నం నుంచి ఎలాగోలా బయటపడ్డాడు.

ఆ తర్వాత వచ్చిన “లెనిన్”కి కూడా అదే పరిస్థితి. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే అఖిల్ అక్కినేనిపై ఉన్న సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అయిందన్నారు. నాగార్జున అంతటివాడు పుత్రోత్సాహంతో రెండు మూడు దఫాలు పెట్టిన కన్నీళ్లు (ఆనంద భాష్పాలు) ప్రేక్షకులను కరిగించడం వల్ల గట్టెక్కగలిగారు అన్నారు. ఆ విధంగా… తొలి చిత్రం “వినరో భాగ్యము విష్ణు కథ”తో మోడరేట్ విజయం అందుకున్న మురళీ కిషోర్ అబ్బూరు కూడా “సెకండ్ సినిమా సిండ్రోమ్”ను అవలీలగా దాటేశాడు.

అప్పుడు వచ్చింది “మా ఇంటి బంగారం”. థియేటర్లు దద్దరిల్లిపోయాయి. బాక్సాఫీసులు బద్దలైపోయాయి. ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ఇలా చెలరేగిపోవడం టాలీవుడ్ లో ఇటీవలకాలంలో ఇదే మొదటిసారి. “అన్నీ మంచి శకునములే”లో ఓ క్లాసికల్ అట్టర్ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుని ఉన్న నందిని రెడ్డి… “ఓ బేబి” అనంతరం సమంతతో మరోసారి జతకట్టి సత్తాను చాటుకున్నారు.

“చెన్నై లవ్ స్టోరీ” సినిమా సైతం పెద్ద సంఖ్యలో పెదవి విరుపులు ఎదుర్కొంది. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని, చెమటోడ్చి విజయ తీరం చేర్చింది చిత్రబృందం. “రవి నంబూరి” ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

తర్వాత వచ్చిన “కొరియన్ కనకరాజు” కూడా డివైడెడ్ టాక్ ను ధీటుగా తట్టుకుని లాభాల బాట పట్టింది. హీరో వరుణ్ తేజ్ ఊపిరి పీల్చుకునేలా చేసింది. “కృష్ణార్జున యుద్ధం, మేస్ట్రో, లైక్ షేర్ సబ్స్క్రైబ్” చిత్రాలతో ఫ్లాప్స్ పరంగా “హ్యాట్రిక్” కొట్టి డీలా పడి ఉన్న మేర్లపాక గాంధీ కెరీర్ ని మళ్లీ గాడిలో పెట్టింది.
ఇక “విశ్వనాద్ అండ్ సన్స్” సినిమా వెంకీ అట్లూరికి హ్యాట్రిక్ ఇచ్చింది తెలుగులో సూర్య మార్కెట్ ఓ ముగిసిన అధ్యాయం అనుకునే పరిస్థితిల్లో అతని కెరీర్ కి మళ్ళీ ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తొలి చిత్రం “తొలి ప్రేమ”తోనే తొలి విజయాన్ని అందుకుని… “మిస్టర్ మజ్ను, రంగ్ దే” చిత్రాల తర్వాత “వన్ పిక్చర్ వండర్”గా మిగిలిపోతాడేమో అనిపించుకున్న అట్లూరి… “విశ్వనాథ్ అండ్ సన్స్”తో హ్యాట్రిక్ సాధించడం చెప్పుకోదగ్గ విశేషం.

ఇక తాజాగా వచ్చిన “ఇరుముడి” హీరోగా రవితేజకు పునర్జన్మ ఇచ్చింది. “దమాఖా” తర్వాత నుంచి పరాజయాల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న రవితేజను “ఇరుముడి” విజయం ఒడ్డుకు చేర్చింది. “నిన్ను కోరి, మజిలీ” చిత్రాలతో మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్టర్ అనిపించుకున్న శివ నిర్వాణ “టక్ జగదీష్, ఖుషీ” చిత్రాల తర్వాత “ఇరుముడి”తో హ్యాపీగా హ్యాట్రిక్ కొడతాడేమో అనే అనుమానాల మధ్య విడుదలైన ఈ చిత్రం అసాధారణ వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ తో రవితేజ అంతకుముందు ఎప్పుడో చేసిన “అమర్ అక్బర్ ఆంటోనీ” అట్టర్ ఫ్లాపయి ఉండడం, అదే బ్యానర్లో శివ నిర్వాణ చేసిన చిత్రం కూడా ఖుషీనివ్వకపోవడం వంటి కారణాలవల్ల… పెద్దగా అంచనాలేమీ లేకుండా బరిలోకి దిగిన ఈ చిత్రానికి ప్రేక్షకులు విజయ హారతులు పడుతున్నారు. ఈ సందర్భంగా “బ్లాస్ట్ జోన్, డీసీ” వంటి తమిళ అనువాద చిత్రాలకు, “ది అబ్సెషన్, స్పైడర్ మ్యాన్” వంటి ఇంగ్లీషు చిత్రాలు కూడా మన తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టడం గమనార్హం!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments