HomeEntertainmentతస్సాదియ్యా

తస్సాదియ్యా

- Advertisment -

ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న సెకండ్ ప్రాజెక్ట్ ‘మా ఇంటి బంగారం’. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం మే 15న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ వేస‌విలో రిలీజ‌వుతోన్న చిత్రాల్లో ఈ యాక్ష‌న్ డ్రామా కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌తో సినిమాపై చాలా మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

ఈ సినిమా ప్రమోష‌న్స్‌లో భాగంగా ముందుగా మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌కు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రీసెంట్‌గా ‘త‌స్సాదియ్యా’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న‌ల్‌గా మారింది. నెట్టింట ఎక్క‌డ చూసినా వైర‌ల్ అవుతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో 20 వేల‌కు పైగా రీల్స్‌లో ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది. అలాగే యూ ట్యూబ్‌, షార్ట్ వీడియోస్‌లోనూ సాంగ్ అంద‌రినీ అల‌రిస్తూ సాంగ్ ట్రెండ్ అవుతూ టాప్ రేంజ్‌లో దూసుకెళ్తోంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments