శ్రీకాంత్, లయ హీరో జంటగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ “మిస్టర్ మిడిల్ క్లాస్”. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొని విడుదల చేశారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. డైరెక్టర్ కృష్ణారెడ్డి రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి గారికి థాంక్స్. చాలా రోజుల తర్వాత హీరోగా నా సినిమా టీజర్ లాంచ్‌కు వచ్చారు. మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. లయ అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఆమెతో మళ్లీ కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. సాయి కార్తీక్ చాలా మంచి సంగీతం అందించారు. సునీల్, వెన్నెల కిషోర్, రఘుబాబు, అలీ వంటి అద్భుతమైన నటీనటులతో చాలా రోజుల తర్వాత కలిసి పనిచేయడం ఆనందాన్ని ఇచ్చింది. చందు, జీకే ఈ చిత్రాన్ని చక్కగా నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్ గారితో నేను ఎన్నో సినిమాలు చేశాను. మళ్లీ ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రను ఆయన ఎంతో నిజాయితీగా, అంకితభావంతో పోషించారు. డైమండ్ రత్నబాబు చాలా చక్కని సంభాషణలు రాశారు” అన్నారు!!

